DA hike for employees | రెండు డీఏల ఫైల్​ సిద్ధం.. అక్టోబరు జీతం నుంచే పెరిగిన డీఏ!

పెరిగిన డీఏను అక్టోబర్‌ నెల జీతం నుంచే మంజూరు చేయనున్నట్లు సమాచారం.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: DA hike for employees | ఉద్యోగులకు సంబంధించిన రెండు డీఏల మంజూరుకు మార్గం సుగమమైంది. రెండు డీఏల మంజూరుకు కేబినెట్‌ ఆమోదం కోసం ఆర్థిక శాఖ ఫైల్‌ను పంపినట్లు సమాచారం. కేబినెట్‌ ఆమోదం లభించిన వెంటనే డీఏ మంజూరుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.

రెండు డీఏలకు సంబంధించి 3.64 శాతం, 2.73 శాతం చొప్పున పెంపు ఉండనుంది. ఈ రెండు డీఏలను కలిపితే మొత్తం 6.37 శాతం పెరుగుతుంది. ప్రస్తుతం ఉన్న 33.67 శాతం డీఏకు మరో 6.37 శాతం కలిపితే కొత్త డీఏ 40.04 శాతానికి చేరనుంది.

CEC House Attack | సీఈసీ పూర్వీకుల ఇంటిపై నల్లరంగుతో రాతలు.. ఆరుగురు కాంగ్రెస్ కార్యకర్తల అరెస్టు

DA hike for employees | అక్టోబర్‌ జీతం నుంచే అమలు

కేబినెట్‌ ఆమోదం అనంతరం అధికారిక ఉత్తర్వులు వెలువడితే, పెరిగిన డీఏను అక్టోబర్‌ నెల జీతం నుంచే మంజూరు చేయనున్నట్లు సమాచారం. దీంతో ఉద్యోగులకు అక్టోబర్‌ జీతంలోనే పెరిగిన డీఏ ప్రయోజనం అందే అవకాశం ఉంది.

డీఏ లెక్కలు..

  • మొదటి డీఏ: 3.64%
  • రెండో డీఏ: 2.73%
  • రెండు డీఏల మొత్తం: 6.37%
  • ప్రస్తుత డీఏ: 33.67%
  • కొత్త డీఏ: 40.04%

అయితే తుది అమలు, ఉత్తర్వుల జారీ తేదీ వంటి అంశాలు కేబినెట్‌ ఆమోదం అనంతరం ప్రభుత్వం జారీ చేసే అధికారిక ఉత్తర్వులపై ఆధారపడి ఉంటాయి.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *