India vs Sri Lanka | హాఫ్​ సెంచరీతో రాణించిన ఇషాన్​.. శ్రీలంక టార్గెట్​ 170

శ్రీలంకతో జరుగుతున్న సెమీ ఫైనల్​లో భారత జట్టు 169 పరుగులు చేసింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : India vs Sri Lanka | ఆసియా క్రీడల్లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న సెమీ ఫైనల్​లో భారత జట్టు 169 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్​ చేయడంతో భారీ స్కోరు చేయలేకపోయింది.

టాస్​ గెలిచిన శ్రీలంక బౌలింగ్​ ఎంచుకుంది. భారత చిచ్చర పిడుగు వైభవ్​ సూర్యవంశీ (Vaibhav Suryavanshi), అభిషేక్​ శర్మ ఓపెనర్లుగా వచ్చారు. అభిషేక్​ 7 పరుగులకే వెను తిరిగాడు. సంజూ శాంసన్​ సైతం 7 పరుగులకే ఔట్ అయ్యాడు. ఓ వైపు వికెట్లు పోతున్న వైభవ్​ లంక బౌలర్లపై విరుచుపడ్డాడు. 21 బంతుల్లో 38 పరుగులు చేశాడు. భారీ షాట్​కు ప్రయత్నించి ఔట్​ అయ్యాడు.

 India vs Sri Lanka | ఇషాన్​ హాఫ్​ సెంచరీ

వైభవ్ ఔట్​ అయ్యాక ఇషాన్​ కిషాన్​ హాఫ్​ సెంచరీతో రాణించాడు. మిగతా బ్యాటర్లు అవుట్​ అవుతున్నా.. నిలకడగా ఆడుతూ భారత్ స్కోర్​ బోర్డును పరుగులు పెట్టించాడు. శ్రేయాస్​ అయ్యార్​ 13, అక్షర్​ పటేల్​ 8, తిలక్​ వర్మ 2, దూబే 3 పరుగులు మాత్రమే చేశారు. ఇషాన్​ కిషన్​ 80 పరుగులతో రాణించడంతో భారత్ ఏడు వికెట్లు కోల్పోయి​ 169 పరుగులు చేసింది. ఈ మ్యాచ్​లో గెలిస్తే భారత్ ఫైనల్​కు చేరుతుంది. అక్కడ గెలిస్తే బంగారు పతకం దక్కుతుంది. కాగా మహిళల టీ 20లో ఇప్పటికే భారత జట్టు పసిడి గెలుచుకుంది.

ఇది కూడా చదవండి..: IND vs WI ODI | హిస్టారికల్ ఛేజింగ్.. విండీస్‌పై భారత్ ఘన విజయం!..రికార్డుల తుపాను సృష్టించిన శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *