Nizamabad Journalists Protest | జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన తప్పదు

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన తప్పదని టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సంజీవ్ అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే నిజామాబాద్ సిటీ : Nizamabad Journalists Protest | జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన తప్పదని టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సంజీవ్ అన్నారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా (Nizamabad District) కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ ప్రెస్ క్లబ్ నుంచి గాంధీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు.

Nizamabad Journalists Protest | గాంధీ విగ్రహానికి వినతిపత్రం..

ర్యాలీ అనంతరం గాంధీ విగ్రహానికి టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో వినతిపత్రం ఇచ్చారు. ఎడ్ల సంజీవ్ మాట్లాడుతూ… ఐజేయూ పిలుపు మేరకు దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా నిరసన తెలుపుతున్నామన్నారు. సమగ్ర మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్​ చేశారు. పాత్రికేయులు, మీడియా సంస్థల భద్రత కోసం ఒక ప్రత్యేక కేంద్ర చట్టాన్ని రూపొందించాలన్నారు. మీడియా ఉద్యోగుల కోసం కొత్త వేతన మండలి ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలో జర్నలిస్టులకు కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు ఇళ్లు, ఇళ్లస్థలాల సమస్య పరిష్కరించాలని కోరారు.

ఉద్యోగులకు ఇచ్చిన విధంగా జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇచ్చి క్యాష్​లెస్​ ట్రీట్మెంట్ అందించాలని సూచించారు. జర్నలిస్టులపై నిత్యం జరుగుతున్న దాడులను అరికట్టేందుకు తగిన చట్టం తీసుకు రావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అరవింద్ బాలాజీ, కోశాధికారి సిరిగాద ప్రసాద్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బొబ్బిలి నర్సయ్య, జాతీయ కౌన్సిల్ సభ్యులు గంగాదాస్, సోషల్ మీడియా సభ్యులు దేవిదాస్, జిల్లా ఉపాధ్యక్షులు గోవిందరాజ్, సాయిరాం, మురళి, ఆర్మూర్, డిచ్​పల్లి ప్రెస్​క్లబ్ అధ్యక్షుడు గంగామోహన్, మురళి, బోధన్ డివిజన్ ఇన్​ఛార్జి గంగులు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Banswada Theft Case | బెయిల్ కోసం అప్పులు.. వాటిని తీర్చేందుకు చోరీల బాట..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *