అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ (PETA Nizamabad) నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ అబ్బాపూర్ రవీందర్ (Dr Abbapur Ravinder) ఎన్నికయ్యారు. నిజామాబాద్ నగరంలోని (Nizamabad) న్యూ అంబేద్కర్ భవన్లో శుక్రవారం ఎన్నికలు నిర్వహించారు.
PETA President Election | అధ్యక్ష, కార్యదర్శులకు ఎన్నికలు..
పెటాలో మొత్తంగా 129 మంది సభ్యులు ఉన్నారు. అధ్యక్ష, కార్యదర్శుల పోస్టులకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా డాక్టర్ అబ్బాపూర్ రవీందర్ ( పీడీ నవీపేట్ జడ్పీహెచ్ఎస్) ఎన్నికయ్యారు. కార్యదర్శిగా గంగాధర్ (ఆర్మూర్ పీడీ) గెలుపొందారు. నూతన కార్యవర్గాన్ని ఈ సందర్భంగా సభ్యులు ఘనంగా సన్మానించారు.
ఇది కూడా చదవండి: నా తమ్ముడు.. అనంత్ అంబానీ!