అక్షరటుడే, వెబ్‌డెస్క్ : SLBC Tunnel Works | ఎస్ఎల్బీసీ పనుల్లో అధికారులు వేగం పెంచారు. గతంలో సొరంగం కూలిపోయిన షియర్ జోన్‌ను దాటేశారు. దీంతో 79శాతం పనులు పూర్తయ్యాయి. ఇంకా 9.1 కిలోమీటర్ల మేర సొరంగం తవ్వాల్సి ఉంది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎస్ఎల్బీసీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పనులు చేపడుతుండగా.. 2025 ఫిబ్రవరి 22న సొరంగం కూలిపోయింది. ఈ ప్రమాదంలో 8 మంది కార్మికులు మృతి చెందారు. అనంతరం అధికారులు పనులు ఆపేశారు. కొన్ని నెలల క్రితం తిరిగి పనులు ప్రారంభింంచారు. ఈ క్రమంలో తాజాగా గతంలో కూలిపోయిన షియర్ జోన్ అనే ఒక ప్రధాన భౌగోళిక అడ్డంకిని దాటినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Komatireddy) తెలిపారు. ఇప్పుడు మరిన్ని పరికరాలను ఉపయోగించవచ్చని, తవ్వకం వేగవంతం చేయవచ్చని పేర్కొన్నారు.
SLBC Tunnel Works | 700 మీటర్ల ముందుకు..
ఐదు నెలల్లో సొరంగ తవ్వకంలో సుమారు 700 మీటర్లు ముందుకు వెళ్లామని మంత్రి తెలిపారు. అందులో అవుట్‌లెట్ నుంచి 450 మీటర్లు, ఇన్‌లెట్ నుండి 250 మీటర్లు ఉన్నాయని ప్రాజెక్ట్ బృందం తెలిపింది. 43.968 కిలోమీటర్ల పొడవున్న ఈ ప్రధాన సొరంగం ఇప్పుడు సుమారు 79 శాతం పూర్తయింది. ఇంకా సుమారు 9.1 కిలోమీటర్లు తవ్వాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఉమ్మడి నల్గొండ (Nalgonda) జిల్లాలోని భూములకు 30 టీఎంసీలకు పైగా నీటిని అందించవచ్చు.
దీనిని కూడా చదవండి : Kusum Group Ukraine | ఉక్రెయిన్‌లో భారత కంపెనీపై రష్యా డ్రోన్ దాడి