Navy Sailor Arrest | కోయంబత్తూరులో నేవీ సైలర్ అరెస్టు.. పాక్ హనీట్రాప్‌లో చిక్కుకున్నాడా?

కొన్ని నెలల క్రితం సోషల్‌ మీడియా ద్వారా ప్రదీప్‌తో ఓ మహిళ పరిచయం పెంచుకున్నట్లు తెలుస్తోంది. ఆమె పాకిస్థాన్‌ ఇంటెలిజెన్స్‌ ఆపరేటివ్‌గా అనుమానిస్తున్నారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Navy Sailor Arrest | భారత నావికాదళానికి చెందిన సైలర్‌ ప్రదీప్‌ ముఖర్జీ (31) ని ఆంధ్రప్రదేశ్‌ పోలీసుల కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ (CI) సెల్‌ అరెస్టు చేసింది. పాకిస్థాన్‌కు చెందిన ఇంటెలిజెన్స్‌ ఆపరేటివ్‌కు సున్నితమైన రక్షణ సమాచారాన్ని చేరవేశారన్న ఆరోపణలపై ఈ చర్యలకు ఉపక్రమించింది. కోయంబత్తూరులోని రెడ్‌ఫీల్డ్స్‌ ప్రాంతంలో ఉన్న INS అగ్రణిలో అదుపులోకి తీసుకున్నారు.

Navy Sailor Arrest | సోషల్‌ మీడియా పరిచయం..

పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రదీప్‌ ముఖర్జీ 2014లో భారత నేవీలో చేరినట్లు అధికారులు వెల్లడించారు. ఆయన ప్రస్తుతం విశాఖపట్నం కేంద్రంగా పనిచేసే ఈస్టర్న్ నేవల్ కమాండ్‌లో విధులు నిర్వహిస్తున్నారు. మేనేజ్‌మెంట్‌ డెవలప్‌మెంట్‌ కోర్సు కోసం దాదాపు వారం రోజుల క్రితం కోయంబత్తూరులోని INS అగ్రణికి వచ్చిన సమయంలో CI అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

విచారణలో వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం.. కొన్ని నెలల క్రితం సోషల్‌ మీడియా ద్వారా ప్రదీప్‌తో ఓ మహిళ పరిచయం పెంచుకున్నట్లు తెలుస్తోంది. ఆమె పాకిస్థాన్‌ ఇంటెలిజెన్స్‌ ఆపరేటివ్‌గా అనుమానిస్తున్నారు.

Mumbai Dead Body Case | నాలుగేళ్లుగా ఇంట్లోనే మృతదేహం.. రూ.50 లక్షలు ఖర్చు చేసిన కుటుంబం!

వ్యక్తిగత సంబంధాన్ని ఉపయోగించుకుని క్రమంగా సున్నితమైన సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ తరహా ఆన్‌లైన్‌ మాయాజాలాన్నే సాధారణంగా ‘హనీట్రాప్‌’గా పేర్కొంటారు.

Navy Sailor Arrest | విశాఖ నేవల్‌ బేస్‌ సమాచారమే లక్ష్యమా?

దర్యాప్తు సంస్థల అనుమానాల ప్రకారం.. విశాఖపట్నం నేవల్‌ బేస్‌కు సంబంధించిన వ్యూహాత్మక నౌకాదళ ఆస్తులు, నౌకల కదలికలు, ఆపరేషనల్‌ వ్యవస్థకు సంబంధించిన వివరాలు విదేశీ ఆపరేటివ్‌కు చేరినట్లు తెలుస్తోంది. అయితే అసలు ఏయే పత్రాలు, సమాచారం షేర్‌ అయ్యింది, వాటి సున్నితత్వం ఎంత అనే విషయాలు ఇంకా దర్యాప్తులో వెల్లడి కావాల్సిఉంది.

CI సెల్‌ ప్రదీప్‌నకు సంబంధించిన అనుమానాస్పద డిజిటల్‌ కార్యకలాపాలను గుర్తించిన తర్వాత నిఘా పెట్టినట్లు అధికారులు తెలిపారు. డిజిటల్‌ ఫుట్‌ప్రింట్స్‌ను పరిశీలించిన అనంతరం అరెస్టు చేసినట్లు సమాచారం.

Navy Sailor Arrest | విజయవాడకు తరలింపు..

అరెస్టు అనంతరం ప్రదీప్‌ను స్థానిక కోర్టులో హాజరుపరిచి తదుపరి దర్యాప్తు కోసం విజయవాడకు తరలించినట్లు తెలుస్తోంది. అతని ఫోన్‌, సోషల్‌ మీడియా సంభాషణలు, డిజిటల్‌ కమ్యూనికేషన్లు, విదేశీ వ్యక్తులతో ఉన్న సంబంధాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.

దీనికితోడు ఈ వ్యవహారంలో ఇంకెవరైనా భాగమయ్యారా?, ఏదైనా ఆర్థిక లావాదేవీ జరిగిందా?, ఎంతకాలంగా సమాచారం చేరవేస్తున్నారు?, ఎంత మేర సమాచారం బయటకు వెళ్లింది? వంటి అంశాలపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది.

Navy Sailor Arrest | నేవీ సిబ్బందే ఎందుకు టార్గెట్?

రక్షణ రంగానికి చెందిన సిబ్బందిని సోషల్‌ మీడియా ద్వారా సంప్రదించి, నకిలీ గుర్తింపులతో వ్యక్తిగత సంబంధాలు పెంచుకుని సమాచారం రాబట్టే ప్రయత్నాలు భద్రతా సంస్థలకు కొత్తేమి కాదు. గతంలోనూ భారత రక్షణ సిబ్బందిని లక్ష్యంగా చేసుకున్న గూఢచర్య కేసులు వెలుగులోకి వచ్చాయి.

సైబర్‌ కమ్యూనికేషన్‌, సోషల్‌ మీడియా పరిచయాలు, వ్యక్తిగత బలహీనతలను ఉపయోగించుకునే గూఢచర్య పద్ధతులపై భద్రతా సంస్థలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది.

Navy Sailor Arrest | అసలు నిజం తేలాల్సి ఉంది

ప్రదీప్‌ ముఖర్జీపై వచ్చిన ఆరోపణలు ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉన్నాయి. అతను నిజంగా ఏ సమాచారాన్ని ఎవరికి పంపాడు ?, ఆ సమాచారం ఎంత సున్నితమైనది ?, విదేశీ ఆపరేటివ్‌ వెనుక ఎవరున్నారు ?, ఈ వ్యవహారంలో మరెవరైనా ఉన్నారా.. అనే అంశాలు దర్యాప్తు, తదుపరి న్యాయ ప్రక్రియలో స్పష్టతకు రావాల్సి ఉంది. (India Today)

విశాఖ నేవల్‌ బేస్‌ నుంచి కోయంబత్తూరు వరకు సాగిన ఈ వ్యవహారంలో డిజిటల్‌ ఆధారాలు కీలకంగా మారే అవకాశం ఉంది. దర్యాప్తు పూర్తయితే ఈ హనీట్రాప్‌ వెనుక ఉన్న నెట్‌వర్క్‌, బయటకు వెళ్లిన సమాచార పరిమాణంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *