Bar Owners Protest | జిల్లాలో బార్లు బంద్​.. ఎందుకో తెలుసా..?

జిల్లావ్యాప్తంగా సోమవారం బార్లు మూసి ఉంచారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Bar Owners Protest | జిల్లావ్యాప్తంగా సోమవారం బార్లు మూసి ఉంచారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు.. విచ్చలవిడి పర్మిట్​రూంల ఏర్పాటును నిరసిస్తూ వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్​ (Hyderabad)లోని నాంపల్లి ఎక్సైజ్​ కార్యాలయం ఎదుట

Bar Owners Protest | ప్రివిలేజ్​ ట్యాక్స్​ పేరుతో వడ్డన..

రాష్ట్రవ్యాప్తంగా బార్లపై ప్రభుత్వం కొత్త నిబంధన ప్రవేశపెట్టింది. ప్రతి బార్​10శాతం ప్రివిలేజ్​ ట్యాక్స్​ కట్టాలని సూచించింది. ఈ నిర్ణయాన్ని రాష్ట్ర బార్ల అసోసియేషన్​ తీవ్రంగా ఖండిస్తోంది. ములిగే నక్క మీద తాటికాయ పడ్డట్లుగా ఇప్పటికే బార్లను నడిపించడంలో ఇబ్బందులు పడుతున్న తమకు ట్యాక్స్​ రూపంలో ప్రభుత్వం వసూళ్లకు పాల్పడడం ఎంతమాత్రం సరైంది కాదని వారు పేర్కొంటున్నారు.

Bar Owners Protest | విచ్చలవిడిగా పర్మిట్​ రూంలతో..

అలాగే రాష్ట్రవ్యాప్తంగా వైన్స్​ల వద్ద విచ్చలవిడిగా పర్మిట్​ రూంలు ఏర్పాటు చేయడంతో బార్లకు గిరాకీ లేకుండా పోయిందని నిర్వాహకులు వాపోతున్నారు. ఒక పర్మిట్​ రూం కేవలం 100 గజాల్లో ఉండాల్సి ఉండగా.. అడ్డదిడ్డంగా విశాల ప్రాంతంలో వాటిని ఏర్పాటు చేసి బార్ల పొట్టగొడుతున్నారని వారు వాపోయారు. నిబంధనలకు విరుద్ధంగా పర్మిట్​ రూంలు ఏర్పాటు చేసినప్పటికీ ఎక్సైజ్​ శాఖ స్పందించడం లేదని వారు వాపోయారు. ప్రభుత్వం వెంటనే ప్రివిలేజ్​ ట్యాక్స్​ తీసివేయాలని.. పర్మిట్​రూం నిబంధనలు పక్కాగా అమలు చేయాలని కోరుతున్నారు. హైదరాబాద్​లోని ఎక్సైజ్​ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమ నిజామాబాద్​ జిల్లా బార్ల అసోసియేషన్​ అధ్యక్షుడు దేవన్న, కార్యదర్శి సంతోష్​, విన్ను, జనార్ధర్​, విశ్వనాథ్​, రంజిత్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి: Bheemgal Tea Seller | పోలీస్​ స్టేషన్ ఎదుట చాయ్​ హోటల్​ నిర్వాహకుడి ఆత్మహత్యాయత్నం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *