Nizamabad Teachers Day | విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలి : ప్రభుత్వ సలహాదారు సుదర్శన్​రెడ్డి

విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి సూచించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad Teachers Day | విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి (MLA Sudarshan Reddy) ఉపాధ్యాయులకు సూచించారు. అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్​లో(Nizamabad) విద్యా శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు.

Nizamabad Teachers Day | ప్రభుత్వ స్కూళ్లలో మెరుగైన విద్య

సుదర్శన్​ రెడ్డి మాట్లాడుతూ.. ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలతో పోలిస్తే.. ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయులు ఎంతో మెరుగైన బోధనా సామర్ధ్యం, నైపుణ్యాలు కలిగి ఉన్నారన్నారు. వారి సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటూ ప్రభుత్వ బడుల్లో చదివే పేదకుటుంబాల పిల్లలకు కూడా నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్​రెడ్డి ఉన్నారన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రూ.వేల కోట్లను వెచ్చిస్తూ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు, తెలంగాణ మోడల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నారని గుర్తుచేశారు. నాణ్యమైన భోజనం, ఏకరూప దుస్తులు, ఇతర అన్ని వసతులు ప్రభుత్వం కల్పిస్తోందని అన్నారు. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే ప్రభుత్వ బడులలో మరుగుదొడ్లు, మూత్రశాలల కోసం రూ.21 కోట్ల నిధులను వెచ్చించామన్నారు.

Nizamabad Teachers Day | విద్యారంగానికి పెద్దపీట

నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్.భూపతిరెడ్డి మాట్లాడుతూ, మునుపెన్నడూ లేనివిధంగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి బడ్జెట్లో పెద్దపీట వేస్తూ, రూ.వేల కోట్ల ఖర్చు చేస్తోందన్నారు. ఉపాధ్యాయుల నియామకాలు, బదిలీలు, పదోన్నతులు, మౌలిక వసతుల పెంపు, కొత్త డైట్ మెనూ అమలు, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు వంటి చర్యల ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు ఎంతో మెరుగయ్యాయని అన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, సులభంగా విద్యార్థులు ఆకళింపు చేసుకునే రీతిలో ఆధునిక పద్ధతుల్లో బోధన చేయాలని సూచించారు. అనంతరం జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, రాష్ట్ర గీత కార్మిక పారిశ్రామిక సంఘం ఛైర్మన్ శేఖర్ గౌడ్, జిల్లా విద్యా శాఖ అధికారి అశోక్, డీఐఈవో రవికుమార్, డీసీఈబీ సెక్రెటరీ సీతయ్య పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: నేనూ.. రాయలసీమ బిడ్డనే..సీఎం చంద్రబాబు 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *