Oct 06 Market Analysis | మిక్స్‌డ్‌గా ఆసియా మార్కెట్లు.. లాభాలతో ప్రారంభం కానున్న సెన్సెక్స్, నిఫ్టీ

ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. మన మార్కెట్లు పాజిటివ్‌గా ప్రారంభమవుతాయన్న సంకేతాన్ని గిఫ్ట్ నిఫ్టీ ఇస్తోంది.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Oct 06 Market Analysis | పశ్చిమాసియా (West asia) దేశాలనుంచి ముడి చమురు ఎగుమతులు నిలకడగా ఉండటం మరియు జీ7 అత్యవసర నిల్వల విడుదలతో సరఫరా ఆందోళనలు తగ్గడంతో ధరలు దిగివస్తున్నాయి. అయితే సౌదీపై యెమన్ హౌతీల దాడులు కొనసాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

ముడి చమురు(Crude oil) ధరలు తగ్గడం, టెక్ ఆధారిత షేర్లలో ర్యాలీ కారణంగా గత సెషన్‌లో వాల్‌స్ట్రీట్ లాభాలతో ముగిసింది. ఆసియా మార్కెట్లు మాత్రం మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్‌గా ఉండడంతో మన మార్కెట్లు లాభాలతో మొదలవనున్నాయి.

Oct 06 Market Analysis | యూఎస్ మార్కెట్లు..

గత సెషన్‌లో నాస్‌డాక్ 1.05 శాతం, ఎస్ అండ్ పీ 0.66 శాతం పెరగ్గా.. మంగళవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.11 శాతం లాభంతో ఉంది.

Oct 06 Market Analysis | యూరోప్ మార్కెట్లు..

జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.09 శాతం, యూకేకు చెందిన ఎఫ్టీఎస్ 0.34 శాతం పెరగ్గా.. ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.81 శాతం నష్టపోయింది.

Oct 06 Market Analysis | ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా మార్కెట్లు లాభాలతో ఉన్నాయి. ఉదయం 7.50 గంటల ప్రాంతంలో హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.73 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 0.29 శాతం లాభంతో, సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 0.52 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.30 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.09 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. చైనా మార్కెట్లకు సెలవు. గిఫ్ట్ నిఫ్టీ 0.26 శాతం లాభంతో ఉండడంతో మన మార్కెట్లు గ్యాప్ అప్ లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

Oct 06 Market Analysis | ఆర్బీఐ ఎంపీసీ మీటింగ్‌పై దృష్టి..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీ సమావేశం సోమవారం ప్రారంభమైంది. వడ్డీ రేట్లపై ఆర్బీఐ తన నిర్ణయాన్ని బుధవారం వెలువరించనుంది. పెరిగిన ముడి చమురు ధరలు, ఇన్ఫ్లెషన్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆర్బీఐ ఎలాంటి కామెంట్స్ చేస్తుందోనన్న అంశాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించారు.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

గమనించాల్సిన అంశాలు..

  • విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు వరుసగా ఏడో సెషన్‌లోనూ నికర అమ్మకందారులుగా ఉన్నారు. నికరంగా రూ. 4,699 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
  • డీఐఐలు వరుసగా 38 వ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 5,181 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 2 పైసలు బలపడి 96.29 వద్ద ఉంది.
  • క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 100.73 డాలర్ల వద్ద ఉంది.
  • యూఎస్ డాలర్ ఇండెక్స్ 102.17 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 5.32 శాతం వద్ద ఉంది.
  • నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 0.77 నుంచి 0.94కు పెరిగింది.
  • విక్స్ 2.21 శాతం పెరిగి 14.77 వద్ద ఉంది.
Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *