Rahul Gandhi Protest | ఢిల్లీలో ఉద్రిక్తత.. ధర్నాకు దిగిన రాహుల్​ గాంధీ

ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలనే డిమాండ్​తో ఇండి కూటమి ఎంపీలు చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Rahul Gandhi Protest | ఢిల్లీలో ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల కమిషనర్​ జ్ఞానేశ్​ కుమార్​ రాజీనామా చేయాలనే డిమాండ్​తో ఇండి కూటమి ఎంపీలు పార్లమెంట్​ నుంచి ఎన్నికల సంఘం వరకు ర్యాలీగా బయలు దేరారు.

ఎంపీల ర్యాలీతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. పార్లమెంట్ నుంచి కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) వరకు భారీగా బలగాలను మోహరించారు. సెంట్రల్​ ఢిల్లీకి వెళ్లే మార్గాలను మూసివేశారు. ఎన్నికల సంఘం కార్యాలయానికి విపక్ష ఎంపీలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ధర్నాకు దిగారు. ఎంపీలతో కలిసి ఆయన రోడ్డుపై బైఠాయించారు. దీంతో హైటెన్షన్​ నెలకొంది.

Rahul Gandhi Protest | ర్యాలీకి దూరంగా ఆప్​

ఎన్నికల కమిషనర్​ను తప్పించాలని ఇటీవల కాక్రోచ్​ జనతా పార్టీ ఆందోళన నిర్వహించిన విషయం తెలిసిందే. ఇదే విషయమై ఎన్నికల సంఘం, కేంద్రంపై ఒత్తిడి తేవడానికి ఇండి కూటమి ర్యాలీ చేపట్టింది. అయితే ఈ ర్యాలీకి డీఎంకే (DMK), ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) దూరంగా ఉండటం గమనార్హం. ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఎంపీలు కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషనర్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎంపీలు మాట్లాడుతూ.. ఎన్నికల కమిషనర్​ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్​ చేశారు.

ఇది కూడా చదవండి: Chinese Crackers Seized | చెన్నై పోర్టులో భారీగా టపాసులు సీజ్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *