అక్షరటుడే, వెబ్‌డెస్క్: Banking Stocks Rally | పశ్చిమాసియా నుంచి చమురు ఎగుమతులు పెరగడంతోపాటు సరఫరాలను పెంచుతామని జీ7 దేశాలు పేర్కొనడంతో ముడి చమురు ధరలు తగ్గుతున్నాయి. బ్యారెల్‌కు వంద డాలర్ల దిగువకు క్రూడ్ ఆయిల్ ధర వచ్చింది.
దీంతో గ్లోబల్ మార్కెట్లు సానుకూలంగా స్పందిస్తున్నాయి. దీనికితోడు రెండో త్రైమాసికంలో బ్యాంకుల అడ్వాన్సులు, డిపాజిట్లలో పెరుగుదలను రిపోర్ట్ చేయడంతో బ్యాంకు స్టాక్‌లలో కొనుగోళ్ల మద్దతు కనిపిస్తోంది. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లో బెంచ్ మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా రెండో సెషన్లోనూ లాభాలతో ఉన్నాయి.
Banking Stocks Rally | గ్యాప్ అప్ లో ప్రారంభం..
దేశీయ మార్కెట్లు (Domestic markets) మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 126 పాయింట్ల లాభంతో ప్రారంభమైనా తొలుత అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొని 124 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి కోలుకుని 471 పాయింట్లుపైకి ఎగబాకింది. నిఫ్టీ 48 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. మొదట్లో 42 పాయింట్లు తగ్గి అక్కడినుంచి కోలుకుని 139 పాయింట్లు పెరిగింది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 475 పాయింట్ల లాభంతో 72,857 వద్ద, నిఫ్టీ 138 పాయింట్ల లాభంతో 22,694 వద్ద ఉన్నాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 19 స్టాక్స్ లాభాలతో, 11 స్టాక్స్ నష్టాలతో సాగుతున్నాయి. ట్రెంట్ 10.72 శాతం, కోటక్ బ్యాంక్ 3.63 శాతం, రిలయన్స్ 2.56 శాతం, ఎటర్నల్ 1.62 శాతం, యాక్సిస్ బ్యాంక్ 1.57 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : టెక్ మహీంద్రా 2.50 శాతం, టైటాన్ 1.31 శాతం, ఐటీసీ 1.21 శాతం, ఇన్ఫోసిస్ 1.16 శాతం, బజాజ్ ఫైనాన్స్ 0.74 శాతం నష్టాలతో ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Oct 06 Gold Prices | బంగారం ధరలు స్థిరం.. వెండి స్వల్పంగా తగ్గే అవకాశం