అక్షరటుడే, ఎల్లారెడ్డి: BJP Vote Deletion | ఓట్లను తొలగించి బీజేపీ కుట్ర చేస్తోందని ఎమ్మెల్యే మదన్ మోహన్ (MLA Madan Mohan) ఆరోపించారు. ఓటు హక్కు పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.
BJP Vote Deletion | భారీర్యాలీ..
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి ఎమ్మెల్యే మదన్ మోహన్, డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు నల్లటి దుస్తులు, నల్లటి బ్యాడ్జీలు ధరించి ర్యాలీలో పాల్గొన్నారు. చౌరస్తా, బస్టాండ్ మీదుగా గాంధీ చౌక్ వరకు భారీ ర్యాలీ కొనసాగింది. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేశారు. ర్యాలీ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఓటుహక్కు పరిరక్షణకు అనుకూలంగా నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున నినాదాలు చేశారు.
సామాన్య ప్రజల ఓట్లు, యువత ఓట్లను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే మదన్మోహన్ ఆరోపించారు. ఓట్ల తొలగింపు వ్యవహారంలో ఎన్నికల కమిషన్ తీరుపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ ఛైర్మన్ జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని వివిధ కాంగ్రెస్ మండలాల నాయకులు, ప్రజాప్రతినిధులు, యువజన నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Illegal Sand Mining | ‘ఇందిరమ్మ’ పేరుతో దర్జాగా ఇసుక దోపిడీ.. మంజీరాను తోడేస్తున్న ఇసుకాసురులు..