Oct 07 Gold Prices | మళ్లీ పెరిగిన బంగారం ధరలు..అదేస్థాయిలో వెండి జోరు

22 క్యారెట్ల బంగారం ధరలు సైతం 10 గ్రాములకు రూ.1.37 లక్షల స్థాయిలో ఉన్నాయి. ఇదే సమయంలో వెండి ధర కిలోకు రూ.2.28 లక్షల పరిధిలో కొనసాగుతోంది.

Naresh Chandan
April 27 Gold Rates

అక్షరటుడే, వెబ్​డెస్క్: Oct 07 Gold Prices | దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం Gold ధరలు మరోసారి అధిక స్థాయిల్లో కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర గ్రాముకు రూ.15,023గా ఉంది. 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.13,771, 18 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.11,268 వద్ద నమోదైంది.

దేశంలోని ప్రధాన నగరాల్లోనూ పసిడి ధరలు 10 గ్రాములకు రూ.1.50 లక్షల సమీపంలోనే కదులుతున్నాయి. 22 క్యారెట్ల బంగారం ధరలు సైతం 10 గ్రాములకు రూ.1.37 లక్షల స్థాయిలో ఉన్నాయి. ఇదే సమయంలో వెండి ధర కిలోకు రూ.2.28 లక్షల పరిధిలో కొనసాగుతోంది.

Oct 07 Gold Prices | ఎంసీఎక్స్‌లో పసిడి, వెండి లాభాల్లో

మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బంగారం ధరలు బలంగా కదిలాయి. 10 గ్రాముల బంగారం రూ.1,50,130 వద్ద ట్రేడవుతూ, గత ముగింపు ధరతో పోలిస్తే రూ.814 లేదా 0.55 శాతం లాభపడింది. అంతకుముందు ముగింపు ధర రూ.1,49,316గా ఉంది.

వెండి ధర కూడా స్వల్పంగా పెరిగింది. కిలో వెండి రూ.2,27,365 వద్ద ట్రేడవుతూ రూ.1,278 లేదా 0.57 శాతం ఎగబాకింది. గత సెషన్‌లో వెండి ముగింపు ధర రూ.2,26,087గా నమోదైంది.

Oct 07 Gold Prices | ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధరలు

ఆల్ ఇండియా India బులియన్ (AIB) రిఫరెన్స్ రేట్ల ప్రకారం దేశంలోని ముఖ్య నగరాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలు ఇలా ఉన్నాయి..

ముంబైలో రూ.1,49,935, ఢిల్లీలో రూ.1,50,140, చెన్నైలో రూ.1,50,215, కోల్‌కతాలో రూ.1,49,720, బెంగళూరులో రూ.1,50,106గా ఉన్నాయి.

22 క్యారెట్ల బంగారం ధరలను పరిశీలిస్తే.. ముంబైలో 10 గ్రాములకు రూ.1,37,595, ఢిల్లీలో రూ.1,37,379, చెన్నైలో రూ.1,37,824, కోల్‌కతాలో రూ.1,37,379, బెంగళూరులో రూ.1,37,737గా నమోదయ్యాయి.

Oct 07 Gold Prices | నగరాల వారీగా వెండి ధరలు

వెండి ధరల విషయానికి వస్తే.. 999 స్వచ్ఛత కలిగిన వెండి కిలోకు ముంబైలో రూ.2,28,022, ఢిల్లీలో రూ.2,28,187, చెన్నైలో రూ.2,28,212, కోల్‌కతాలో రూ.2,28,212, బెంగళూరులో రూ.2,28,269 వద్ద ఉంది.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

బంగారం, వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, దేశీయ డిమాండ్, కరెన్సీ కదలికలు, పెట్టుబడిదారుల సెంటిమెంట్ వంటి పలు అంశాల ప్రభావంతో నిరంతరం మారుతుంటాయి. అందువల్ల నగల కొనుగోలు సమయంలో స్థానిక బులియన్ మార్కెట్‌లోని తాజా ధరలను పరిశీలించడం మంచిది.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *