Sangameshwara Temple | ఎల్​నినో ఎఫెక్ట్.. తేలిన సంగమేశ్వర ఆలయం

నాగర్‌కర్నూల్ జిల్లాలోని సంగమేశ్వరాలయం కృష్ణా నదిలో నీటి మట్టం తగ్గడంతో బయటపడింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Sangameshwara Temple | నాగర్‌కర్నూల్ జిల్లా (Nagarkurnool District) కొల్లాపూర్ మండలంలోని సోమశిల సమీపంలో ఉన్న చారిత్రక సంగమేశ్వరాలయం కృష్ణా నదిలో నీటి మట్టం తగ్గడంతో బయటపడింది. ప్రతి ఏటా వేసవిలో మాత్రమే ఈ ఆలయం బయట పడుతుంది. కానీ ఈ సారి ముందుగానే తేలడం గమనార్హం.

కృష్ణానదిలో గల సంగమేశ్వర ఆలయం ప్రతి యేటా వానాకాలంలో మునిగి పోతుంది. అనంతరం వేసవిలో నీటి మట్టం తగ్గిన తర్వాత బయట పడుతుంది. అయితే ఈ ఏడాది ఎల్​నినో ప్రభావంతో వర్షాలు ఎక్కువగా పడలేదు. కృష్ణానదికి వరదలు వచ్చినా.. శ్రీశైలం నిండలేదు. అయితే భారీగా వరద రావడంతో సంగమేశ్వర ఆలయం మునిగిపోయింది. శ్రీశైలం ప్రాజెక్ట్​ నుంచి కాలువలు, విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని విడుదల చేస్తుండటంతో నీటి మట్టం వేగంగా పడిపోతుంది. దీంతో తాజాగా సంగమేశ్వర ఆలయ గోపురం బయట పడింది.

Sangameshwara Temple | 8 నెలలు నీటిలోనే..

సాధారణంగా వేసవి కాలంలో మాత్రమే కనిపించే ఈ ఆలయం, ఈ ఏడాది ముందుగానే నీటి పైకి తేలింది. దాదాపు 25 ఏళ్ల తర్వాత ఇలా జరగడం విశేషమని స్థానికులు చెబుతున్నారు. ఈ ఆలయం ప్రతి ఏటా ఏడాదిలో సుమారు 8 నెలల పాటు కృష్ణా నది నీటిలో మునిగి ఉండి, దాదాపు 4 నెలల పాటు నీటి మట్టానికి పైన ఉంటుంది. ఈ ఏడాది మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రాజెక్ట్​లో నీటి నిల్వలు తగ్గుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఇది కూడా చదవండి..: Ponnam Prabhakar Vote Rights | రాహుల్, ప్రియాంకల అరెస్టు అప్రజాస్వామికం: మంత్రి పొన్నం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *