Stock Market Losses | నష్టాల్లో ప్రధాన సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ బుధవారం నష్టాల బాటలో పయనిస్తోంది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 175 పాయింట్లు, నిఫ్టీ 101 పాయింట్ల నష్టంతో ఉన్నాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market Losses | దేశీయ స్టాక్ మార్కెట్ లో రెండు రోజుల ర్యాలీకి అడ్డుకట్ట పడింది. మూడేళ్ల తర్వాత ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచవచ్చన్న అంచనాలతో ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన నిర్ణయం తర్వాత బ్యాంక్ నిఫ్టీ సానుకూలంగా ట్రేడవుతోంది. దీంతో ప్రధాన సూచీలు దిగువ స్థాయినుంచి కోలుకున్నాయి. సెన్సెక్స్ రోజు కనిష్ట స్థాయి నుండి 450 పాయింట్లు, నిఫ్టీ 130 పాయింట్లు పెరిగాయి.

Stock Market Losses | గ్యాప్ డౌన్ లో ప్రారంభం..

దేశీయ మార్కెట్లు (Domestic markets) బుధవారం గ్యాప్ డౌన్ లో ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 102 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 445 పాయింట్లు పడిపోయింది. కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో కోలుకుని 452 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 86 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 112 పాయింట్లు కోల్పోయింది. కనిష్టాలనుంచి కోలుకుని 132 పాయింట్లు పెరిగిది. మధ్యాహ్నం 12.15 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 175 పాయింట్ల నష్టంతో 72,892 వద్ద, నిఫ్టీ 101 పాయింట్ల నష్టంతో 22,675 వద్ద ఉన్నాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 6 స్టాక్స్ లాభాలతో, 24 స్టాక్స్ నష్టాలతో సాగుతున్నాయి. కోటక్ బ్యాంక్ 1.81 శాతం, ఎయిర్‌టెల్ 1.78 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 0.63 శాతం, ఎటర్నల్ 0.64 శాతం, బజాజ్ ఫైనాన్స్ 0.49 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers : టైటాన్ 3.57 శాతం, బీఈఎల్ 1.83 శాతం, ఆసియన్ పెయింట్ 1.80 శాతం, టాటా స్టీల్ 1.51 శాతం, మారుతి 1.49 శాతం నష్టాలతో ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: Oct 07 Gold Prices | మళ్లీ పెరిగిన బంగారం ధరలు..అదేస్థాయిలో వెండి జోరు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *