అక్షరటుడే, వెబ్డెస్క్ : DA Hike | ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. పెండింగ్లో ఉన్న డీఏలను మంజూరు చేస్తూ బుధవారం జీవో విడుదల చేసింది.
రాష్ట్రంలో 6 డీఏలు పెండింగ్లో ఉన్న విషయం తెలిసిందే. ఇందులో రెండు డీఏలు ఇచ్చేందుకు ఇటీవల ప్రభుత్వం అంగీకరించింది. ఇందులో భాగంగా తాజాగా ఆ రెండు పెండింగ్ డీఏలు మంజూరు చేస్తూ ఆదేశాలు చేసింది. జనవరి 2024 నుంచి డీఏను 33.67 శాతం నుంచి 37.31 శాతానికి పెంచింది. అలాగే జూలై 2024 నుంచి డీఏను 37.31 శాతం నుంచి 40.04 శాతానికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రెండు డీఏల బకాయిలను విడతలవారీగా ప్రభుత్వం చెల్లించనుంది.
DA Hike | విడతల వారీగా..
పెంచిన డీఏను అక్టోబర్ జీతంతో కలిపి నవంబర్ 1న చెల్లించనున్నారు. దీంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మిగతా 4 డీఏలను కూడా విడుదల చేయాలని కోరుతున్నారు. జనవరి 2024 డీఏ 33 నెలల బకాయిలు 33 విడతల వారీగా ప్రభుత్వం చెల్లించనుంది. అలాగే జూలై 2024 డీఏ 27 నెలల బకాయిలులను 27 వాయిదాల్లో ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయనుంది.
దీనిని కూడా చదవండి : Ponnam Prabhakar Vote Rights | రాహుల్, ప్రియాంకల అరెస్టు అప్రజాస్వామికం: మంత్రి పొన్నం