అక్షరటుడే, నందిపేట్: Wild Boar Seizure Nandipet | అటవీప్రాంతం (Nandipet Forest) నుంచి అడవిపందులను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు అటవీశాఖాధికారులు వివరాలు వెల్లడించారు.
Wild Boar Seizure Nandipet | ఏపీకి తరలింపు
రాత్రి గస్తీ విధులు నిర్వహిస్తున్న సమయంలో అడవి పందులను ఒక వాహనంలో అక్రమంగా తరలిస్తున్నట్లు అటవీ సిబ్బందికి సమాచారం అందింది. ఈ సమాచారంతో నందిపేట పరిసర ప్రాంతాల్లో గస్తీ నిర్వహిస్తుండగా.. వెల్మల్ ప్రాంతంలో ఒక అనుమానాస్పద వాహనం కనిపించింది. వెంటనే అటవీ సిబ్బంది వాహనాన్ని తనిఖీ చేయగా, అందులో ఏడు అడవి పందులు ఉన్నట్లు గుర్తించారు. వాహన డ్రైవర్ విజయ్ను అదుపులోకి తీసుకొని విచారించగా, ఆ అడవి పందులను బైంసా ప్రాంతం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని జంగారెడ్డి గూడెం (jangareddy gudem) ప్రాంతానికి తరలిస్తున్నట్లు వెల్లడించాడు.
Wild Boar Seizure Nandipet | రిజర్వ్ ఫారెస్ట్‌లో..
వెంటనే నందిపేట పోలీసులకు సమాచారం అందించగా, వారు సంఘటనా స్థలానికి చేరుకొని అటవీ సిబ్బందికి సహకరించారు. అనంతరం ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఏడు అడవి పందులను రేంజ్ కార్యాలయానికి తరలించి, వాటి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన అనంతరం సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్‌లో సురక్షితంగా విడిచిపెట్టారు. అడవి పందులను అక్రమంగా రవాణా చేసిన నిందితుడు విజయ్‌పై చట్టప్రకారం కేసు నమోదు చేసి, న్యాయస్థానం ముందు హాజరుపర్చగా, న్యాయమూర్తి 10 రోజుల రిమాండ్ విధించారు. ఈ ఆపరేషన్‌లో అటవీ శాఖ తరపున రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ అరుణ్ కుమార్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ సుధాకర్, మాధవి, గంగాధర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లింబాద్రి పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: ఢిల్లీలో కుప్పకూలిన భవనం..