అక్షరటుడే, వెబ్డెస్క్: Pregnancy Nutrition Awareness | గర్భిణులు ఆరోగ్యంగా ఉండేందుకు సమతుల్యమైన పౌష్టికాహారం తీసుకోవడం ఎంతో అవసరమని వైద్యులు, అంగన్వాడీ సిబ్బంది సూచించారు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని రైతు వేదికలో గర్భిణులు, లబ్ధిదారులు, అంగన్వాడీ సిబ్బందికి పోషణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
Pregnancy Nutrition Awareness | పలు అంశాలపై అవగాహన..
ఈ సందర్భంగా గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన పౌష్టికాహారం, పాటించాల్సిన ఆరోగ్య నియమాలు, తల్లి – శిశువు ఆరోగ్యంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. గర్భిణులు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడంతో పాటు వైద్యుల సూచనలు పాటించాలని తెలిపారు. ఈ సందర్భంగా గర్భిణులకు సీమంతం నిర్వహించారు.
Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..
కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఆఫీసర్, సీడీపీఓ గాలి విజయలక్ష్మి, డాక్టర్ రాథోడ్ శ్రీలత, సీహెచ్ఐ భూలక్ష్మి, ఎస్ఎస్సీ ప్రశాంత్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు రాథోడ్ రాధిక, సుజాత, శ్రీప్రియ, ప్రియదర్శిని, సీత, స్వరూప, పోషణ బ్యాన్ బీసీ కోఆర్డినేటర్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గర్భిణులు, లబ్ధిదారులు, అంగన్వాడీ టీచర్లు కార్యక్రమానికి హాజరయ్యారు.