Dasara Special Trains | దసరా, దీపావళికి ప్రత్యేక రైళ్లు

దసరా, దీపావళికి తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dasara Special Trains | దసరా, దీపావళి పండుగ నేపథ్యంలో ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్​ న్యూస్​ చెప్పింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది.

దసరాకు హైదరాబాద్​ (Hyderabad) నగరం నుంచి వేలాది మంది ప్రజలు స్వగ్రామాలకు వెళ్తారు. దీపావళి సమయంలో సైతం రద్దీ అధికంగా ఉంటుంది. ఈ క్రమంలో టీజీఎస్​ ఆర్టీసీ దసరాకు 7 వేల ప్రత్యేక బస్సులు నడుపుతామని తెలిపింది. తాజాగా రైల్వే శాఖ సైతం స్పెషల్​ ట్రైన్లు వేస్తున్నట్లు ప్రకటించింది.

Dasara Special Trains | ఈ మార్గాల్లో..

చర్లపల్లి-శ్రీకాకుళం మధ్య అక్టోబర్ 6, 13, 20, 27 తేదీల్లో ప్రత్యేక రైలు నడపనున్నారు. నవంబర్ 3, 10, 17, 24 తేదీల్లో సైతం స్పెషల్​ ట్రైన్​ సేవలు అందిస్తోంది. నవంబర్ 25 వరకు విశాఖపట్నం-బెంగళూరు వీక్లీ ఎక్స్‌ప్రెస్‌, నవంబర్ 30 వరకు నర్సాపూర్-తిరువణ్ణామలై ఎక్స్‌ప్రెస్‌ సర్వీసును నడుపుతామని అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి..: Fake Property Documents | నకిలీ పత్రాలతో ఆస్తులు కాజేస్తున్న ముఠా అరెస్ట్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *