అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market Crash | జియో పొలిటికల్ టెన్షన్స్‌తో నెలకొన్న కఠినమైన ఆర్థిక పరిస్థితులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. గల్ఫ్, హార్మూజ్ జలసంధిలో నౌకలపై దాడులు పెరగడంతో ముడి చమురు సరఫరాకు అంతరాయాలు కలగవచ్చన్న భయాలు వెన్నాడుతున్నాయి. దీంతో ముడి చమురు ధరలు పెరుగుతుండడంతో ద్రవ్యోల్బణ పెరుగుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్లు (Global Markets) ఎరుపెక్కాయి.
Stock Market Crash | మన మార్కెట్లలో సెల్లాఫ్..
విదేశీ సంస్థాగత మదుపరుల నిరంతర పెట్టుబడుల ఉపసంహరణ, పెరుగుతున్న యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్, రూపాయి విలువ దిగజారుతూ రోజుకో జీవనకాల కనిష్టాన్ని నమోదు చేస్తుండడం వంటి కారణాలతో మన మార్కెట్లు సెల్లాఫ్ కు గురవుతున్నాయి. ఈ ఏడాది మరోసారి వడ్డీ రేటు పెంపు ఉంటుందని యూఎస్ ఫెడ్ మినిట్స్ సంకేతాలు ఇవ్వగా.. ఇన్ఫ్లెషన్‌పై ఆర్బీఐ సైతం కఠిన వైఖరి అవలంబిస్తుండడంతో మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపింది. యూఎస్ బాండ్ ఈల్డ్స్ అధికంగా ఉన్నంత కాలం సెల్ ఆన్ ర్యాలీ ధోరణి కొనసాగుతుందని అనలిస్టులు అంచనా వేస్తున్నారు.
Stock Market Crash | ఫ్లాట్‌గా ప్రారంభం.
.దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic stock market) గురువారం ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 30 పాయింట్ల గ్యాప్ అప్‌లో ప్రారంభమై మరో 25 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి ఒక్కసారిగా సెల్లాఫ్‌కు గురై 840 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ 4 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 271 పాయింట్లు క్షీణించింంది. మధ్యాహ్నం 12.10 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 701 పాయింట్ల నష్టంతో 71,937 వద్ద, నిఫ్టీ 250 పాయింట్ల నష్టంతో 22,352 వద్ద ఉన్నాయి.
Top gainers : బీఎస్ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 7 స్టాక్స్ లాభాలతో, 23 స్టాక్స్ నష్టాలతో సాగుతున్నాయి. టైటాన్ 1.35 శాతం, టెక్ మహీంద్రా 1.07 శాతం, టీసీఎస్ 0.94 శాతం, ఇన్ఫోసిస్ 0.91 శాతం, హెచ్సీఎల్ టెక్ 0.91 శాతం లాభాలతో ఉన్నాయి.
Top losers : ఐటీసీ 3.71 శాతం, అదానీపోర్ట్స్ 3.60 శాతం, ఇండిగో 2.98 శాతం, పవర్‌గ్రిడ్ 2.57 శాతం, రిలయన్స్ 2.22 శాతం నష్టాలతో ఉన్నాయి.
ఇది కూడా చదవండి..: Oct 08 Gold Prices | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. వెండి కూడా డౌన్