New Bar Applications | నూతన బార్ ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం

బిచ్కుంద మున్సిపాలిటీలో నూతన బార్ ఏర్పాటుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముకుంద రెడ్డి తెలిపారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: New Bar Applications | బిచ్కుంద (Bichkunda) ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని మున్సిపాలిటీలో (Kamareddy) నూతన బార్ ఏర్పాటుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముకుంద రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు.

New Bar Applications | ఈనెల 12వ తేదీలోపు..

నూతన బార్ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటివరకు తమ కార్యాలయంలో 11 దరఖాస్తులు అందాయని ఆయన వెల్లడించారు. ఆసక్తి, అర్హత కలిగిన వారు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుదారులు ఫారం-1 ద్వారా రూ. లక్షను డిమాండ్ డ్రాఫ్ట్ లేదా చలాన్ రూపంలో చెల్లించాలని, దరఖాస్తుతో పాటు మూడు పాస్ పోర్టు సైజు ఫొటోలు, ఆధార్ కార్డు, పాన్ కార్డు జిరాక్స్ ప్రతులను జత చేయాలని తెలిపారు. దరఖాస్తులను అక్టోబర్ 12వ తేదీ వరకు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయ పనివేళల్లో జిల్లా ఆబ్కారీ కార్యాలయంలో సమర్పించవచ్చని పేర్కొన్నారు. ఎంపికైన బార్​ ఏడాదికి రూ.30 లక్షల ఎక్సైజ్ పన్నును నిబంధనల ప్రకారం విడతల వారీగా ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. బార్ కేటాయింపు ప్రక్రియను అక్టోబర్ 16వ తేదీ ఉదయం 11 గంటలకు కలెక్టర్ ఆధ్వర్యంలో లక్కీ డ్రా పద్ధతిలో పారదర్శకంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి: సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు భద్రత పెంపు..జెడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించిన కేంద్రం..!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *