అక్షరటుడే, పెద్దకొడప్గల్(పిట్లం): Farmers Electricity Supply | రైతులకు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే డిమాండ్ చేశారు. పిట్లం మండలకేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో తలపెట్టిన ధర్నాలో రైతులతో కలిసి పాల్గొన్నారు.
Farmers Electricity Supply | వ్యవసాయానికి విద్యుతే కీలకం..
ఈ సందర్భంగా హన్మంత్ షిండే (Hanmant Shinde) మాట్లాడుతూ.. వ్యవసాయానికి విద్యుత్ ఎంతో కీలకమన్నారు. సరైన సమయంలో విద్యుత్ సరఫరా లేకపోతే రైతులు సాగుచేసిన పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. సాగునీటి అవసరాలకు అనుగుణంగా రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే గుర్తించి, విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పంటలు చేతికొచ్చే కీలక సమయంలో విద్యుత్ కోతలు రైతులకు ఇబ్బందులు కలిగిస్తాయని, వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయకుండా రైతుల అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రైతుల హక్కుల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని, రైతులకు న్యాయం జరిగే వరకు వారికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Nizamabad Land Scam | జిల్లాలో భారీ భూ స్కాం.. ప్రోహిబిటేడ్ భూమికి రిజిస్ట్రేషన్