అక్షరటుడే, వెబ్‌డెస్క్: Navi Pillay Nobel Peace Prize | ‘నేడు ఎనిమిది యుద్ధాలు ఆపాను.. నాకే నోబెల్ శాంతి బహుమతి రావాలి’ అని చెప్పిన ట్రంప్ (Trump)నకు మరోసారీ నిరాశే ఎదురైంది. భారత మూలాలున్న మహిళకు ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి దక్కింది. 2026 ఏడాదికి సంబంధించిన నోబెల్ శాంతి పురస్కారం దక్షిణాఫ్రికాకు చెందిన నవనీతమ్ ‘నవీ’ పిళ్లైను వరించింది.
Navi Pillay Nobel Peace Prize | నోబెల్ కమిటీ ప్రకటన
నార్వే రాజధాని ఓస్లోలో నోబెల్ కమిటీ నవీ పిళ్లైకి ఈ అవార్డును ప్రకటించింది. అంతర్జాతీయ శాంతి, న్యాయ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఆమె చేసిన కృషికి గాను ఈ గౌరవం దక్కింది. నవీ పిళ్లై 2008 నుంచి 2014 వరకు ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్‌గా పనిచేసింది.
Navi Pillay Nobel Peace Prize | క్రిమినల్ ట్రిబ్యునల్ అధ్యక్షురాలిగా..
నవనీతమ్ రువాండా అంతర్జాతీయ క్రిమినల్ ట్రిబ్యునల్ అధ్యక్షురాలిగా, అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు న్యాయమూర్తిగా సేవలందించారు. యుద్ధ నేరాలకు పాల్పడినవారిని బాధ్యులుగా నిలబెట్టడంతో పాటు బాధితులకు న్యాయం అందించడం వంటి అంశాల్లో ఆమె కృషిని నోబెల్ కమిటీ గుర్తించింది. ఈ ఏడాది శాంతి పురస్కారం కోసం మొత్తం 287 నామినేషన్లు వచ్చిన విషయం తెలిసిందే.
ఇది కూడా చదవండి..: US Green Card Suspension | అమెరికా షాకింగ్ నిర్ణయం.. భారత ఐటీ కంపెనీలపై సస్పెన్షన్