అక్షరటుడే, వెబ్‌డెస్క్: Abhijit Deepke Arrest | ఢిల్లీలో సీజేపీ నిరసనల నేపథ్యంలో ఆ పార్టీ అధ్యక్షుడు అభిజిత్ దీప్కేను పోలీసులు అరెస్ట్ చేశారు. దీప్కేతో పాటు నాయకులు సౌరవ్ దాస్, అశుతోష్ ర్యాంకాలను ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ (Gyanesh Kumar) రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ.. సీజేపీ ఆధ్వర్యంలో జంతర్‌మంతర్ వద్ద నిరసనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ నిరసనకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఈ క్రమంలో నిరసన కోసం ఢిల్లీకి వచ్చిన సీజేపీ నాయకులను ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేశారు. తమను అరెస్ట్ చేస్తున్న వీడియోను దీప్కే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విమానం నుంచి దించే వరకు ఎందుకు ఆగలేకపోయారని సీజేపీ సభ్యులు పోలీసులతో వాగ్వాదం చేశారు.
Abhijit Deepke Arrest | మేము భయపడం
మేము బయటకు వచ్చే వరకు మీరు ఆగాల్సింది. రండి మమ్మల్ని అరెస్టు చేయండి, మేము భయపడము అని విమానం ఎక్కిన మహిళా పోలీసులతో దీప్కే అన్నారు. జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శనకు నాయకత్వం వహించేందుకు దీప్కే ఉదయం ముంబై నుంచి ఢిల్లీకి బయలుదేరారు. కాగా వారి అరెస్ట్‌ను సీజేపీ ఒక ప్రకటనలో ఖండించింది. దీప్కే, దాస్, రాంకాలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. అంతకుముందు పోలీసులు యూట్యూబర్ ధ్రువ్ రాథీ, సీజేపీ లీగల్ సెల్ హెడ్ రత్నా సింగ్‌లను కూడా హౌస్ అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి..: CJP Protest | సీజేపీ ఆందోళన.. ఢిల్లీలో హై టెన్షన్