CJP Protest | మమతా బెనర్జీ, కేజ్రీవాల్ అరెస్ట్​

సీజేపీ నిరసనల్లో పాల్గొనడానికి వెళ్తున్న మాజీ ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, పినరయి విజయన్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: CJP Protest | సీజేపీ నిరసనల్లో పాల్గొనడానికి వెళ్తున్న బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జంతర్​మంతర్​కు వెళ్తున్న మమతను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బస్టాండ్​ వద్ద కూర్చొని నిరసన తెలుపగా.. ఆమెతో పాటు పలువురు ఎంపీలను పోలీసులు అరెస్ట్​ చేశారు.

CJP Protest | సీఈసీ రాజీనామా చేయాలి

మమత (Mamata Banerjee)తో పాటు ఐదుగురు ఎంపీలను బస్సులో అక్కడి నుంచి తరలించారు. నిరసన సమయంలో ఆమె నోటికి బ్యాండడ్జ్​ వేసుకొని కూర్చున్నారు. ఉదయం నుంచి కేజ్రీవాల్ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఆయన ఇంటి నుంచి బయటకు రాగానే అదుపులోకి తీసుకున్నారు. కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్, సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్​ను కూడా అరెస్ట్ చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్​ జ్ఞానేశ్​కుమార్​ రాజీనామా చేయాలని వారు డిమాండ్​ చేశారు.

ఇది కూడా చదవండి..: Shashi Tharoor | ఢిల్లీలో ఆంక్షలపై శశిథరూర్​ ఆగ్రహం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *