Tirumala Navaratri Brahmotsavams | తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. ఆ రోజు వరకు వీఐపీ దర్శనాలు రద్దు

తిరుమల క్షేత్రంలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల ఘట్టం ప్రారంభం కానుంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Tirumala Navaratri Brahmotsavams | తిరుమల క్షేత్రంలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల ఘట్టం ప్రారంభం కానుంది. ఈ ఉత్సవాలకు నేడు అధికారికంగా అంకురార్పణ జరగనుంది. రాత్రి 7 గంటలకు శ్రీవారి సేనాధిపతి విష్వక్సేనుల వారి ఊరేగింపుతో బ్రహ్మోత్సవాల ప్రక్రియ మొదలవుతుంది. రేపటి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి  ( Tirupati ) దేవస్థానం (టీటీడీ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

Tirumala Navaratri Brahmotsavams | ఆర్జిత సేవల రద్దు..

బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు ఉదయం 9 గంటలకు శ్రీవారు బంగారు తిరుచ్చిపై ఊరేగనున్నారు. అనంతరం రాత్రి 7 గంటలకు మొదటి వాహన సేవగా పెద్దశేష వాహన సేవ వైభవంగా జరగనుంది. ఉత్సవాల సమయంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు అన్ని రకాల ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు , వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. సాధారణ భక్తులకు ఎక్కువ దర్శన సమయం కల్పించేందుకే ఈ చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది.

Tirumala Navaratri Brahmotsavams | భక్తుల రద్దీ వివరాలు..

ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 16 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతోంది. గడిచిన 24 గంటల్లో మొత్తం 79,737 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, వారిలో 24,326 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.71 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి:  ATM Theft | దొంగల హల్​చల్​.. ఏటీఎంలో చోరీ

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *