Riyadh Airport Attack | సౌదీ ఎయిర్​పోర్టుపై దాడిని ఖండించిన భారత్​

రియాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంపై క్షిపణి దాడిని భారత్​ ఖండించింది.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్: Riyadh Airport Attack | సౌదీ అరేబియా (Saudi Arabia) రాజధాని రియాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంపై క్షిపణి దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిని ఆదివారం భారత్​ ఖండించింది.

Riyadh Airport Attack | క్షిపణి దాడిలో..

క్షిపణి దాడిలో 12 మంది మరణించగా, 300 మందికి పైగా గాయపడ్డారు. పౌరులు, పౌర మౌలిక సదుపాయాలపై ఇలాంటి దాడులు ఆమోదయోగ్యం కావని భారత్​ పేర్కొంది. రియాద్‌లోని కింగ్ ఖలీద్ విమానాశ్రయంపై (King Khalid International Airport) జరుగుతున్న దాడులను, అక్టోబర్ 10న జరిగిన దారుణమైన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపింది. సౌదీ సార్వభౌమాధికార పరిరక్షణలో ఆ దేశ ప్రజలకు, ప్రభుత్వానికి తాము సంఘీభావంగా నిలుస్తామని విదేశాంగ శాఖ ప్రకటనలో పేర్కొంది.

Riyadh Airport Attack | హౌతీల పని..

మృతులలో నలుగురు సౌదీ పౌరులతో పాటు ఇద్దరు బంగ్లాదేశీయులు, ఒక పాలస్తీనియన్, ఒక అమెరికా పౌరుడు, ఒక ఈజిప్షియన్, ఒక జోర్డాన్ దేశస్థుడు, ఒక సిరియన్, సూడాన్​కు చెందిన ఒకరు ఉన్నారు. యెమెన్‌లోని ఇరాన్ మద్దతుగల హౌతీ తిరుగుబాటుదారులే ఈ దాడికి కారణమని సౌదీ ఆరోపించింది. కాగా గత దశాబ్ద కాలంలో సౌదీపై జరిగిన పెద్ద దాడి ఇదే కావడం గమనార్హం. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. రియాద్ నుండి అన్ని విమానాలను దారి మళ్లించారు. ఎయిర్​పోర్టులో కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు.

ఇది కూడా చదవండి: బతుకమ్మ ప్రసాదాల వెనుక ఆరోగ్య రహస్యాలు! 

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *