Sharannavaratri Celebrations | ఎల్లారెడ్డి వైశ్యభవన్​లో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

ఎల్లారెడ్డి పట్టణంలో శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా ప్రారంభమయ్యాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sharannavaratri Celebrations | పట్టణంలో (Yellareddy) శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా ప్రారంభమయ్యాయి. దేవీ శరన్నవరాత్రులను పురస్కరించుకొని పట్టణంలోని వైశ్య భవన్‌లో వాసవీమాతను దుర్గామాత రూపంలో అలంకరించి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, పూజా కార్యక్రమాలను నిర్వహించారు.

Sharannavaratri Celebrations | కలశాలతో ర్యాలీ..

ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు సిద్ది శ్రీధర్ గుప్తా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాల్లో భాగంగా ఎల్లారెడ్డి పట్టణంలోని పోచమ్మ ఆలయం నుంచి ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు కలశాలతో భక్తిశ్రద్ధలతో ర్యాలీ నిర్వహించారు. అమ్మవారి నామస్మరణలు, ఆధ్యాత్మిక వాతావరణం నడుమ సాగిన ఈ కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది. అనంతరం వైశ్య భవన్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.

Sharannavaratri Celebrations | తొమ్మిది రోజులపాటు ప్రత్యేక పూజలు

శరన్నవరాత్రుల సందర్భంగా తొమ్మిది రోజులపాటు వైశ్య భవన్‌లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతిరోజూ అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి పూజలు నిర్వహించడంతో పాటు భక్తులకు దర్శన ఏర్పాట్లు చేయనున్నట్లు పేర్కొన్నారు. అమ్మవారి అనుగ్రహంతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు.

Sharannavaratri Celebrations | గ్రామాల్లోనూ ఆధ్యాత్మిక శోభ

ఎల్లారెడ్డి పట్టణంలో చైతన్య యూత్, ఇంద్రసేన ఆధ్వర్యంలో 34 ఏళ్లుగా దుర్గామాత నవరాత్రులు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. దేవునిపల్లి గ్రామంలో సైతం దుర్గ మాతను ప్రతిష్ఠించి భక్తులు మాలధారణ చేశారు. పరిసర గ్రామాల్లోనూ శరన్నవరాత్రి ఉత్సవాల సందడి నెలకొంది. పలు ప్రాంతాల్లో భక్తులు దుర్గామాత విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అమ్మవారి దీక్షలు చేపట్టిన భక్తులు నియమనిష్ఠలతో పూజలు చేస్తూ భక్తిని చాటుకుంటున్నారు. ఆలయాలు, పూజా మండపాలు భక్తులతో సందడిగా మారుతుండగా, తొమ్మిది రోజులపాటు పట్టణం, గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొననుంది. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు కంచర్ల బాలకిషన్, ఓర విఠల్, సాయినాథ్, సారథి సాయిప్రసాద్ , సిద్ధి చక్రధర్ తదితరులు పాల్గొన్నారు.

121 656 877 4565

ఇది కూడా చదవండి: ఆరేళ్ల చిన్నారి మృతి.. హైదరాబాద్‌లో విషాదం! 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *