Russia Ukraine Ceasefire | ఎనర్జీ సీజ్​ ఫైర్​.. రష్యా – ఉక్రెయిన్​ యుద్ధంపై ట్రంప్​ కీలక ప్రకటన

రష్యా- ఉక్రెయిన్​ ఎనర్జీ సీజ్​ ఫైర్​కు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్​ ప్రకటించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Russia Ukraine Ceasefire | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ (Donald Trump) కీలక ప్రకటన చేశారు. రష్యా, ఉక్రెయిన్​ ఎనర్జీ సీజ్​ ఫైర్​కు అంగీకరించాయని తెలిపారు.

ఏళ్లుగా సాగుతున్న రష్యా–ఉక్రెయిన్ ​యుద్ధంతో ఆ దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. మరోవైపు ప్రపంచంలో సంక్షోభం నెలకొంది. ఈ క్రమంలో యుద్ధం ముగింపు కోసం భారత్​ సహా పలు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ట్రంప్​ కీలక ప్రకటన చేశారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధంలో తక్షణమే ఇంధన కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిందన్నారు. ఈ కాల్పుల విరమణకు ఇరు పక్షాలు అంగీకరించాయని తెలిపారు. అయితే ఈ ఒప్పందం వివరాలను ఆయన వెల్లడించలేద.

Russia Ukraine Ceasefire | ఎన్నికల కోసం..

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్​స్కీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. యుద్ధం నుంచి తమకు రెండు నెలల సమయం కావాలని కోరారు. దేశంలో అధ్యక్ష ఎన్నికలు నిర్వహించాలని ప్రజలు డిమాండ్​ చేస్తున్నారు. ఈ క్రమంలో 60 రోజుల కాల్పుల విరమణ సమయం ఇస్తే ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఈ విషయాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్​కు చెప్పాలని కోరారు. ఈ క్రమంలో తాజాగా ట్రంప్​ ప్రకటన చేశారు. అయితే దీనిపై రష్యా నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

దీనిని కూడా చదవండి : El Niño Effect | యాసంగిలో పంటలు వేయొద్దు.. మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *