అక్షరటుడే, కామారెడ్డి: Brahmanpalli Alumni Reunion | జిల్లాలోని(Kamareddy) తాడ్వాయి మండలంలోని బ్రాహ్మణపల్లి జడ్పీహెచ్ఎస్ విద్యార్థులు 25ఏళ్ల తర్వాత ఒక్కచోట కలిశారు. పూర్వవిద్యార్థుల సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు.
Brahmanpalli Alumni Reunion | 2001 ఏడాది పదో తరగతి విద్యార్థులు..
2001లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బ్రాహ్మణపల్లి)లో చదివిన పదో తరగతి పూర్వ విద్యార్థులు.. బ్రాహ్మణపల్లి గ్రామంలో ఒక్కచోట కలిసి తమ పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఆత్మీయంగా పలకరించుకున్నారు. మధుర స్మృతులను నెమరువేసుకున్నారు. తమ విద్య,వైవాహిక, ఉద్యోగ జీవిత విశేషాలు కుటుంబ నేపథ్యాల విషయాలపై ఒకరికొకరు తమపిల్లలు చదువుల గురించి వివరాలు చెప్పుకుంటూ సంతోషంగా గడిపారు. అనంతరం ఆనాడు తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు హన్మంత్ రెడ్డి, శ్రీశైలం, సంగయ్య, విద్య, నర్సయ్య, శంకర్, వెంకట్ రావు, నర్సింహులును పూర్వ విద్యార్థులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పూర్వఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: ‘రణబాలి’ నుంచి ‘కోబలి’ సాంగ్ రిలీజ్..అక్టోబర్ 16న సినిమా విడుదల!