అక్షరటుడే, వెబ్డెస్క్: Oct 12 Horoscope | జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కదలికలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. అక్టోబరు 12, 2026 సోమవారం రోజు ఆకాశంలో ఏర్పడుతున్న అరుదైన గ్రహాల కలయిక కారణంగా ద్వాదశ రాశుల వారికి మిశ్రమ ఫలితాలు లభించనున్నాయి. కొన్ని రాశుల వారికి ఊహించని ధనలాభాలు, కెరీర్ పరంగా గొప్ప అవకాశాలు ఎదురుకాగా, మరికొన్ని రాశుల వారు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
Oct 12 Horoscope | రాశుల వారీగా..
మేష రాశి: Oct 12 Horoscope | తోబుట్టువుల సహకారం లభిస్తుంది, సమస్యలను దాచకుండా కుటుంబంతో పంచుకోండి. దీర్ఘకాలిక ప్రయోజనకరమైన కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం. వైవాహిక జీవితంలో ఇద్దరి మధ్య బంధం మరింత బలపడుతుంది.
వృషభ రాశి: Oct 12 Horoscope | మనసులోని విచారాన్ని దరిచేరనీయకండి, ఇది అభివృద్ధికి అడ్డుగా మారుతుంది. పెట్టుబడుల విషయంలో నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోండి. కుటుంబంలో మీ దబాయింపు ధోరణిని మార్చుకుని సహకారంతో ముందుకు సాగండి.
మిథున రాశి: Oct 12 Horoscope | క్రీడలలో పాల్గొనే అవకాశం ఈరోజు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలంగా ఉండదు . సృజనాత్మక పనులలో నిమగ్నమై, మీ పనులను అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు.
కర్కాటక రాశి: Oct 12 Horoscope | పన్నులు ఎగవేయాలని చూసే వారికి తీవ్రమైన సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగంలో సీనియర్ల నుంచి పూర్తి మద్దతు, ప్రశంసలు లభిస్తాయి. జీవిత భాగస్వామితో ఎంతో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు.
సింహ రాశి: Oct 12 Horoscope | పథకాల్లో పెట్టుబడి పెట్టే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. లేదంటే నష్టపోయే ప్రమాదం ఉంది. ఇతరులతో వాదనలకు దిగడం వల్ల అనవసర గొడవలు జరుగుతాయి..
కన్యా రాశి: Oct 12 Horoscope | అమ్మ తరఫు బంధువుల నుంచి ఆర్థిక లాభం పొందే అవకాశం ఉంది. కుటుంబ వేడుకలు లేదా సమావేశాలలో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. భైరవ ఆలయంలో ప్రసాదం సమర్పించడం వల్ల ప్రేమ జీవితం మెరుగుపడుతుంది.
తులా రాశి: Oct 12 Horoscope | ఇంటి పనుల నిమిత్తం ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు,దీనివల్ల ఆర్థిక భారం పడవచ్చు. ప్రయాణాల కోసం వేసుకున్న ప్లాన్లు చివరి నిమిషంలో వాయిదా పడతాయి.
వృశ్చిక రాశి: ఆకర్షణీయమైన ప్రవర్తనతో అందరినీ ఆకట్టుకుంటారు. వ్యాపార భాగస్వాముల సహకారంతో పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తారు. కాసేపు ఒంటరిగా గడపడం వల్ల మీ జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి.
ధనుస్సు రాశి: ఆర్థిక పరంగా నష్టాలు రావచ్చు, లావాదేవీల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇతరులు ఏమనుకుంటున్నారో పట్టించుకోకుండా ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు. ఎలాంటి కొత్త ప్లాన్ వేసినా జీవిత భాగస్వామితో తప్పకుండా సంప్రదించండి.
మకర రాశి: సమయస్ఫూర్తితో పాటు ఓర్పు, అవగాహన కలిగి ఉంటే విజయం మీ సొంతమవుతుంది. పోస్ట్ ద్వారా అందే ఒక శుభవార్త కుటుంబం అంతటికీ ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఫలితాలు కోరుకున్నట్లు రాకపోతే మీ పని విధానాన్ని సమీక్షించుకోండి.
Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..
కుంభ రాశి: పిల్లల ఆరోగ్యం క్షీణించడం వల్ల కొద్దిగా ఆందోళన చెందే అవకాశం ఉంది. విదేశాలలో చేసిన పెట్టుబడులు అమ్ముడై మీకు మంచి లాభాలను అందిస్తాయి. ఉద్యోగార్థులు ఇంటర్వ్యూలకు హాజరవడానికి ఇది అనుకూలమైన రోజు. జీవిత భాగస్వామితో చిన్నపాటి మనస్పర్ధలు రావచ్చు.
మీన రాశి: ధనం విషయంలో పెద్దల సలహా తీసుకోండి. ధన సంపాదన కోసం మీకొచ్చిన కొత్త ఆలోచనలను ఆచరణలో పెట్టి ప్రయోజనం పొందంతారు. జీవిత భాగస్వామి మీకు అద్బుతమైన సర్ఫ్ రైజ్ చేస్తారు.