Poker Raid | పేకాట స్థావరాలపై మెరుపు దాడి.. 16 మంది అరెస్ట్

కమ్మర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరాలపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, భీమ్‌గల్(కమ్మర్‌పల్లి): Poker Raid | కమ్మర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో (Kammarpally Police) పేకాట స్థావరాలపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ మేరకు ఎస్సై సీహెచ్ సతీష్ వివరాలు వెల్లడించారు.

Poker Raid | హాసాకొత్తూర్​ గ్రామ శివారులో..

హసకొత్తూర్ గ్రామ శివారులో రాత్రి సమయంలో కొందరు వ్యక్తులు రహస్యంగా పేకాట ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న 16 మందిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పోలీసుల రాకను గమనించిన మరో ఇద్దరు నిందితులు అక్కడి నుంచి పరారయ్యారని పోలీసులు తెలిపారు. పట్టుబడిన వారి నుంచి రూ.21,800 నగదుతో పాటు 15 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నామని.. నిందితులపై రెండు వేర్వేరు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. పరారైన ఇద్దరు నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: తప్పు ఎవరు చేసినా తప్పే.. రేవంత్ సర్కార్‌పై కోమటిరెడ్డి హాట్ కామెంట్స్! 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *