Oct 14 Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్ మార్కెట్లు..నష్టాలతో ప్రారంభంకానున్న సెన్సెక్స్, నిఫ్టీ

ప్రధాన గ్లోబల్ మార్కెట్లు మిక్స్‌డ్‌గా సాగుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ నష్టాలతో ఉండడంతో మన మార్కెట్లు గ్యాప్ డౌన్ లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Oct 14 Market Analysis | సెమీకండక్టర్ స్టాక్స్‌లో నష్టాలు కొనసాగుతుండడంతో మంగళవారం వాల్ స్ట్రీట్(Wallstreet) స్వల్ప నష్టాలతో ముగిసింది. ప్రధాన ఆసియా మార్కెట్లు పాజిటివ్‌గా ఉన్నా.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతుండడంతో ఇంధన సరఫరాలపై ఆందోళనతో ముడిచమురు(Crude oil) ధరలు పెరుగుతున్నాయి. ఇది దేశీయ ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తోంది.

Oct 14 Market Analysis | యూఎస్ మార్కెట్లు..

గత సెషన్‌లో నాస్‌డాక్ 0.15 శాతం, ఎస్ అండ్ పీ 0.02 శాతం నష్టపోగా.. బుధవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.01 శాతం లాభంతో ఉంది.

Oct 14 Market Analysis | యూరోప్ మార్కెట్లు..

జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.07 శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.07 శాతం, యూకేకు చెందిన ఎఫ్టీఎస్ ఈ 0.06 శాతం పెరిగాయి.

Oct 14 Market Analysis | ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా మార్కెట్లు లాభాలతో ఉన్నాయి. ఉదయం 7.50 గంటల ప్రాంతంలో సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 1.40 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 1.08 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 0.54 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.10 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.06 శాతం లాభంతో ఉండగా.. హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.20 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.39 శాతం నష్టంతో ఉండడంతో మన మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

nandan Nilekani AI exams | పేపర్ లీకేజీలకు చెక్ పెట్టేలా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో పరీక్ష రోజునే ప్రశ్నపత్రం! : నందన్ నీలేకని కీలక ప్రకటన

గమనించాల్సిన అంశాలు..

  • విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు వరుసగా 13వ సెషన్‌లోనూ నికర అమ్మకందారులుగా ఉన్నారు. నికరంగా రూ. 1,305 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
  • డీఐఐలు వరుసగా 44 వ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 2,439 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 51 పైసలు బలపడి 95.28 వద్ద ఉంది.
  • క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 106.87 డాలర్ల వద్ద ఉంది.
  • యూఎస్ డాలర్ ఇండెక్స్ 102.14 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 5.22 శాతం వద్ద ఉంది.
  • నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 0.73 నుంచి 1.16 కు పెరిగింది.
  • విక్స్ 7.43 శాతం తగ్గి 14.12 వద్ద ఉంది.
Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *