Turmeric Farmers Issues | పసుపు రైతుల సమస్యలు పరిష్కరించాలి : పల్లె గంగారెడ్డి

పసుపు రైతుల సమస్యలు పరిష్కరించాలని జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్​ పల్లె గంగారెడ్డి కోరారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Turmeric Farmers Issues | పసుపు రైతుల సమస్యలు పరిష్కరించాలని జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్​ పల్లె గంగారెడ్డి కోరారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్​కు వినతిపత్రం అందజేశారు.

Turmeric Farmers Issues | పసుపు బోర్డు కార్యకలాపాలు

కేంద్ర మంత్రిని పసుపు బోర్డు కార్యకలాపాలను పల్లె గంగారెడ్డి వివరించారు. అనంతరం పసుపు రైతులు (Farmer) ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రైతుల సమస్యలకు తగిన పరిష్కారాలు చూపించి, పసుపు రైతులకు న్యాయం జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. దానికి కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో కిసాన్ సంఘ్ అధ్యక్షుడు సాయిరెడ్డి, అధికార ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: BJP Kamareddy Committee | బీజేపీ మహిళా మోర్చా నూతన కార్యవర్గం నియామకం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *