అక్షరటుడే, వెబ్డెస్క్ : Vangaveeti Radha | మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ జనసేన (Janasena) పార్టీలో చేరారు. ఉప ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pavan Kalyan) ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
టీడీపీ (TDP)లో ఉన్న రాధాకృష్ణ జనసేనలో చేరడం రాజకీయం ఆసక్తికరంగా మారింది. అనంతరం రాధాకృష్ణ తన అనుచరులను పవన్ కల్యాణ్కు పరిచయం చేశారు. జనసేన సిద్ధాంతాలకు అనుగుణంగా కలిసి పనిచేయాలని, సమష్టిగా ప్రజాసేవలో నిమగ్నం కావాలని పవన్ కళ్యాణ్ వారికి పిలుపునిచ్చారు. వంగవీటి రాధాతో పాటు తిరుపతికి చెందిన ప్రణీత్ పెనుమాదు సైతం జనసేనలో చేరారు.
Vangaveeti Radha | మేయర్ రేసులో..
దివంగత వంగవీటి మోహన రంగా తనయుడు అయిన వంగవీటి రాధాకృష్ణ విజయవాడలో కీలక నేత. ఆయన కాంగ్రెస్ నుంచి తన రాజకీయ జీవితం ఆరభించారు. 2004లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. అనంతరం ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 2014లో వైసీపీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం 2019లో టీడీపీలో చేరారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీలో కొనసాగుతున్న ఆయన అదే కూటమిలోని జనసేనలో చేరడం గమనార్హం. కాగా జనసేన నుంచి ఆయన విజయవాడ మేయర్ రేసులో ఉన్నట్లు సమాచారం. అందుకోసమే పార్టీలో చేరారని తెలుస్తోంది. తిరుపతి మేయర్ రేసులో ప్రణీత్ పెనుమాదు పేరు తెరపైకి వచ్చింది.
దీనిని కూడా చదవండి : Meerut Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసులో సంచలన తీర్పు.. భార్య, ప్రియుడికి ఉరిశిక్ష