అక్షరటుడే వెబ్‌డెస్క్: Croma Festival of Dreams 2026 | పండుగ సీజన్‌ను పురస్కరించుకుని టాటా గ్రూప్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ( Electronics ) రీటైలర్ ‘క్రోమా’ (Croma) తన వార్షిక పండుగ క్యాంపెయిన్ ‘ఫెస్టివల్ ఆఫ్ డ్రీమ్స్’ను ప్రారంభించింది. ఎలక్ట్రానిక్స్ , గృహోపకరణాలపై భారీ ఆఫర్లను ప్రకటించిన ఈ సేల్ అక్టోబర్ 31, 2026 వరకు అందుబాటులో ఉంటుంది. కస్టమర్లు ఎంపిక చేసిన అప్లయన్సెస్‌పై ఫ్లాట్ 35% వరకు డిస్కౌంట్, రూ. 45,000 వరకు క్యాష్‌బ్యాక్, అలాగే రూ. 20,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌లను పొందవచ్చు.
Croma Festival of Dreams 2026 | ప్రత్యేక ఆఫర్లు..
క్రోమాలో యాపిల్ ప్రియుల కోసం ప్రత్యేకమైన ఎక్స్ఛేంజ్ , బ్యాంక్ క్యాష్‌బ్యాక్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అర్హత గల ఎక్స్ఛేంజ్ , క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో ఐఫోన్ 17 రూ. 58,990, ఐఫోన్ 17 ప్రో రూ. 94,490, ఐఫోన్ 17 ప్రో మాక్స్ రూ. 1,07,990 ప్రారంభ ధరలతో లభిస్తాయి. అలాగే స్టూడెంట్/టీచర్ డిస్కౌంట్లు , బ్యాంక్ ఆఫర్లతో మ్యాక్‌బుక్ ఎయిర్ M5 రూ. 1,01,910 నుంచి, ఐప్యాడ్ 11వ జనరేషన్ రూ. 42,065 నుంచి ప్రారంభమవుతాయి.
Croma Festival of Dreams 2026 | హోమ్ ఎంటర్టైన్మెంట్ ..
పండుగ వేళ ఇళ్లను సరికొత్తగా తీర్చిదిద్దేందుకు పెద్ద స్క్రీన్ టీవీలు, హోమ్ అప్లయన్సెస్ పై ఆకర్షణీయమైన ధరలు ఉన్నాయి. ఎల్జీ 55-ఇంచ్ ఏఐ నానో టీవీ రూ. 41,990 నుంచి, శామ్సంగ్ 65-ఇంచ్ 4K మినీ ఎల్ఈడీ టీవీ రూ. 76,990 నుంచి, సోనీ 75-ఇంచ్ బ్రావియా 2 4K టీవీ రూ. 1,19,900 నుంచి అందుబాటులో ఉన్నాయి. అలాగే 1.5-టన్ గొడ్రెజ్ ఇన్వర్టర్ ఏసీ రూ. 28,990 (లేదా నెలకు రూ. 2,416 ఈఎంఐ) నుంచి, ఎల్జీ వాషింగ్ మెషిన్ రూ. 21,790 నుంచి, రెఫ్రిజరేటర్ రూ. 35,491 నుంచి ప్రారంభమవుతాయి.
Croma Festival of Dreams 2026 | ఆడియో ఆఫర్లు..
హెచ్‌పీ విక్టస్ గేమింగ్ లాప్టాప్ రూ. 81,140 నుంచి లభిస్తుండగా, లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లు కేవలం రూ. 1,599 నెలవారీ ఈఎంఐ నుంచి అందుబాటులో ఉన్నాయి. మార్షల్ బ్లూటూత్ స్పీకర్లపై 35% వరకు డిస్కౌంట్ ఉండగా, రూ. 2,000లకు పైగా కొనుగోలుపై క్రోమా 120డబ్ల్యూ సౌండ్‌బార్‌ను కేవలం రూ. 5,400లకే సొంతం చేసుకోవచ్చు.
Croma Festival of Dreams 2026 | అదనపు పొదుపు ప్రయోజనాలు..
ప్రముఖ క్రెడిట్/డెబిట్ కార్డులు , ఎన్ఎఫ్సీ భాగస్వాముల ద్వారా రూ. 45,000 వరకు ఇన్స్టంట్ క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. పాత ఎలక్ట్రానిక్స్ మార్చుకోవడం ద్వారా రూ. 20,000 వరకు గ్యారెంటీడ్ ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుంది. టైర్-2, టైర్-3 నగరాల్లోని ఎంపిక చేసిన స్టోర్లలో ప్రత్యేక ఉచిత కానుకలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్లను సమీపంలోని క్రోమా స్టోర్‌లో లేదా croma.com , టాటా న్యూ యాప్ ద్వారా పొందవచ్చు.
ఇది కూడా చదవండి: Vangaveeti Radha | జనసేనలో చేరిన వంగవీటి రాధా