అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bonfiglioli Transmissions IPO | బాన్‌ఫిగ్లియోలి ట్రాన్స్మిషన్స్ లిమిటెడ్ కంపెనీ వివిధ రకాల పరిశ్రమలలో వినియోగించే గేర్ బాక్స్‌లు, డ్రైవ్ సిస్టమ్స్‌ను రూపొందించి, తయారు చేస్తుంది. దీంతోపాటు మెకానికల్, ఎలక్ట్రో మెకానికల్ పవర్ ట్రాన్స్మిషన్, ఇండస్ట్రియల్ డ్రైవ్ సొల్యూషన్స్‌ను అందించే లీడింగ్ టెక్నాలజీ డ్రివెన్ కంపెనీ ఇది.
Bonfiglioli Transmissions IPO | రూ. 2,533.66 కోట్ల సమీకరణ లక్ష్యం..
ఐపీవో (IPO) ద్వారా రూ. 2,533.66 కోట్లు సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా నిర్దేశించుకుంది. రూ. 10 ఫేస్ వ్యాల్యూ కలిగిన 4,32,39,042 షేర్లను విక్రయించడం ద్వారా ఈ ఆదాయాన్ని పొందనున్నారు. ఇది పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్.. అంటే ఐపీవో ద్వారా వచ్చిన ఆదాయం తమ షేర్స్ విక్రయించిన షేర్ హోల్డర్ల ఖాతాలలోకి వెళ్తుంది.
Bonfiglioli Transmissions IPO | ప్రైస్ బ్యాండ్..
కంపెనీ ఒక్కో ఈక్విటీ షేరు ధరను రూ. 558 నుంచి రూ. 586 గా నిర్ణయించింది. ఒక లాట్లో 25 షేర్లున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్ కోసం గరిష్ట ప్రైస్ బ్యాండ్ వద్ద రూ. 14,650 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.
కోటా : ఐపీవోలో క్యూఐబీలకు 50 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం, ఎన్ఐఐలకు 15 శాతం వాటాను కేటాయించారు.
జీఎంపీ : టోంబో ఇమేజింగ్ ఇండియా లిమిటెడ్ కంపెనీ షేర్లకు గ్రే మార్కెట్లో డిమాండ్ ఉంది. ఒక్కో ఈక్విటీ షేరు రూ. 173 ప్రీమియంతో ఉంది. అంటే ఐపీవో అలాట్ అయినవారికి లిస్టింగ్ సమయంలోనే 30 శాతం వరకు లాభాలు వచ్చే అవకాశాలున్నాయి.
ఐపీవో తేదీలు : ఐపీవో సబ్స్క్రిప్షన్ అక్టోబర్ 15 న ప్రారంభమైంది. అక్టోబర్ 19 వరకు అందుబాటులో ఉంటుంది. షేర్ల అలాట్మెంట్ స్టేటస్ 21న రాత్రి వెల్లడయ్యే అవకాశాలున్నాయి. కంపెనీ షేర్లు అక్టోబర్ 23న బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్ అవుతాయి.
ఇది కూడా చదవండి..: Tombo Imaging IPO | 71 శాతం జీఎంపీ.. ఊరిస్తున్న డిఫెన్స్ కంపెనీ ఐపీవో