అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Armoor Police Review | ఆర్మూర్ డివిజన్ పరిధిలోని అంకాపూర్‌లో (Ankapur) లాలన వృద్ధాశ్రమాన్ని సీపీ సాయిచైతన్య (CP Saichaitanya) సందర్శించారు. అక్కడి వృద్ధులతో అప్యాయంగా మాట్లాడారు. అనంతరం డివిజన్‌పై ఆశ్రమంలోనే పోలీసు అధికారులతో సమీక్షించారు.
Armoor Police Review | వృద్ధుల బాగోగులు తెలుసుకుంటూ..
మొదట సీపీ సాయిచైతన్య లాలన వృద్ధాశ్రమాన్ని సందర్శించారు. అక్కడి వృద్ధులు ఒక్కొక్కరితో అప్యాయంగా మాట్లాడారు. వారి బాగోగులు తెలుసుకున్నారు. ఆరోగ్యాలు బాగా చూసుకోవాలని సూచించారు. అనంతరం వారికి దుస్తులు అందజేశారు. అక్కడే ఆర్మూర్ డివిజన్‌పై సమీక్ష అనంతరం ఆశ్రమంలోనే ఆర్మూర్ డివిజన్ పోలీస్ అధికారులతో సీపీ సమీక్షించారు. డివిజన్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న కేసుల పురోగతిని తెలుసుకున్నారు. డ్రగ్స్, గంజాయి నిర్మూలన కోసం ప్రత్యేక దాడులు కొనసాగించాలన్నారు. అక్రమ రవాణాలో పాల్గొనే వారిపై పీడీ యాక్ట్ వంటి కఠిన చట్టాల కింద చర్యలు తీసుకోవాలని కమిషనర్ పేర్కొన్నారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
Armoor Police Review | వాహనాల తనిఖీ చేయాలి
రాబోయే పండుగల నేపథ్యంలో బందోబస్తు ఏర్పాట్లను పటిష్టంగా నిర్వహించాలని సీపీ ఆదేశించారు. వాహనాల తనిఖీలు 24/7 తనిఖీలు చేయాలని, వాహనాల తనిఖీలు సమయంలో సిబ్బంది అలసత్వం పనికిరాదని తెలిపారు. ఈ సందర్బంగా ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, సీసీఆర్బీ గురునాయుడు, సీసీఆర్బీ ఇన్స్పెక్టర్ అంజయ్య, సీఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: రైతు బీమా ఇవ్వకపోతే రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ధర్నా