Gas Price Hike | ఒక్కరోజే రూ. 993 పెరిగిన గ్యాస్ ధరలు.. కేంద్రంపై రాహుల్ గాంధీ ఆగ్రహం

Balla Sandeep Kumar

అక్షరటుడే, న్యూఢిల్లీ : Gas Price Hike | దేశంలో వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరగడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. “ఎన్నికలు ముగియగానే ధరల సెగ మొదలవుతుందని నేను ముందే చెప్పాను” అంటూ ఆయన హిందీలో ట్వీట్ చేశారు.

Gas Price Hike | ఒక్క రోజులోనే..

భారీ బాదుడు: ఒక్క రోజులోనే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ (Gas Cylinder) ధర రూ. 993 పెరగడాన్ని ఆయన తప్పుబట్టారు. దీనిని “ఎన్నికల బిల్లు” (చునావీ బిల్)గా ఆయన అభివర్ణించారు. ఫిబ్రవరి నెల నుంచి ఇప్పటివరకు సిలిండర్ ధరపై మొత్తం రూ. 1,380 పెరిగిందని, కేవలం మూడు నెలల కాలంలోనే 81 శాతం ధర పెరగడం ఆందోళనకరమని ఆయన ఆరోపించారు.

చిరు వ్యాపారులపై మోయలేని భారం: గ్యాస్ ధరల పెంపు వల్ల టీ కొట్టు యజమానులు, ధాబాలు, హోటళ్లు, బేకరీలు, స్వీట్ షాపుల వంటి చిన్న వ్యాపారుల వంటగదులపై మోయలేని భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. హోటల్, వ్యాపార రంగంలో గ్యాస్ ధరలు పెరగడం వల్ల దాని ప్రభావం నేరుగా సామాన్యుడి ఆహారం (థాలీ) పై పడుతుందని, వస్తువుల ధరలు పెరుగుతాయని హెచ్చరించారు.

Gas Price Hike | ముంచుకొస్తున్న పెట్రో బాదుడు?

తొలి దెబ్బ గ్యాస్ రూపంలో పడిందని, తదుపరి ప్రభావం పెట్రోల్, డీజిల్ ధరలపై పడబోతోందని రాహుల్ గాంధీ జోస్యం చెప్పారు. ఎన్నికల ఫలితాల అనంతరం ప్రజలపై వరుసగా ధరల భారాలు పడతాయని ఆయన హెచ్చరించారు.

ఇది కూడా చదవండి..: Mumbai Cocaine Seizure | ముంబైలో ఎన్సీబీ సంచలనం.. రూ.1,745 కోట్ల కొకైన్ సీజ్!

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
3 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *