Bala Bharosa Program | బాల భరోసా కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి: డీఎంహెచ్​వో రాజశ్రీ

Shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Bala Bharosa Program | బాల భరోసా కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీఎంహెచ్​వో రాజశ్రీ సూచించారు. నగరంలోని జీజీహెచ్​లో (GGH) ఏడో అంతస్తులో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బాల భరోసా (Bala Bharosa) కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు.

Bala Bharosa Program | పిల్లల్లో నాడీ సంబంధిత అభివృద్ధి సమస్యలు..

ఈ సందర్భంగా రాజశ్రీ మాట్లాడుతూ.. ఐదేళ్ల పిల్లల అభివృద్ధిలో జాప్యాలు.. నాడీ సంబంధిత అభివృద్ధి సమస్యలు గుర్తించేందుకు బాల భరోసా కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమo విజయవంతం కావడానికి మహిళా శిశు సంక్షేమ శాఖ, ఆరోగ్య శాఖ (Health Department) సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జిలా సంక్షేమాధికారిణి పద్మ శిబిరాన్ని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

అలాగే జీజీహెచ్​ ఇన్​ఛార్జి సూపరింటెండెంట్​ నాగమోహన్​ మాట్లాడుతూ.. శారీరక వైకల్యాలున్న పిల్లలకు చికిత్స అందించడానికి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి (Government Hospital) నుంచి పూర్తి సహకారం ఉంటుందన్నారు. డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్ అశోక్ మాట్లాడుతూ మే నెలలో సెలవులున్నాయని.. కావున ఆర్​బీఎస్​కే టీంలు స్క్రీనింగ్ చేయడానికి అంగన్​వాడీ టీచర్లు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సీడడీపీవోలు, సూపర్​వైజర్లు, మెడికల్​ హెల్త్​ టీం వైద్యులు, ఆర్​బీఎస్​కే సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Padakal Palm Fire | ఈతవనంలో కార్చిచ్చు.. అగ్నికి ఆహుతైన 200 ఈత చెట్లు!

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *