Rain Alert | రైతులకు అలర్ట్​.. నేటి నుంచి వర్షాలు

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నేటి నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Rain Alert | తెలంగాణ (Telangana)లోని పలు ప్రాంతాల్లో నేటి నుంచి అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈశాన్య రుతుపవనాల రాకతో నాలుగు రోజులుగా ఛత్తీస్​గఢ్​ సరిహద్దు జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి. శనివారం నుంచి ఇతర జిల్లాల్లో సైతం వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణుడు బాలాజీ తెలిపారు.

చలికాలం ప్రారంభం అయినా.. రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. పగటి పూట రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలో వర్షం పడితే కాస్త ఉపశమనం లభించే అవకాశం ఉంది. ఎండలు, విద్యుత్​ కోతలతో పంటలు ఎండిపోతున్నాయి. ఈ సమయంలో వర్షం కురిస్తే పంటలకు మేలు జరుగుతుంది. అయితే ఇప్పటికే కోతలు ప్రారంభించిన రైతుల ధాన్యం తడిసి పోయే అవకాశం ఉంది. ఈ మేరకు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Rain Alert | ఈ జిల్లాల్లో..

తెలంగాణలోని నాగర్‌కర్నూల్, నల్గొండ, భద్రాద్రి – కొత్తగూడెం, ఖమ్మం, వనపర్తి, రంగారెడ్డి, యాదాద్రి, మెదక్, సిద్దిపేట, హన్మకొండ, వరంగల్, జనగాం, ములుగు, మంచిర్యాల, ఆసిఫాబాద్, సిరిసిల్ల, నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్, వికారాబాద్, మహబూబ్ నగర్, గద్వాల్, నారాయణపేట జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి. అయితే ఈ వర్షాలు అక్కడక్కడ మాత్రమే పడుతాయి. పెద్ద వర్షాలు పడే అవకాశం లేదు. వర్షం లేని ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంటుంది.

ఇది కూడా చదవండి..: Telangana Ropeway Projects | తెలంగాణ టూరిజానికి కొత్త రెక్కలు.. రూ.1,230 కోట్లతో 5 ప్రాంతాల్లో రోప్‌వేలు!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *