అక్షరటుడే, వెబ్‌డెస్క్: Rajasthan Bus Accident | రాజస్థాన్ (Rajasthan)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కోటాలో శనివారం తెల్లవారుజామున ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై ఓ బస్సు బోల్తా పడి గుంతలో పడిపోయింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా, 17 మంది గాయపడ్డారు.
భోపాల్ నుంచి ఖాటు శ్యామ్‌కు వెళ్తున్న బస్సు కోటా సమీపంలో ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో బస్సులో 27 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ కునుకు తీయడంతో బస్సు అదుపు తప్పి, రెయిలింగ్‌ను ఢీకొని గుంతలో పడిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
Rajasthan Bus Accident | ఆస్పత్రికి తరలింపు
గాయపడిన వారిని ఎం.బి.ఎస్ ఆసుపత్రికి, న్యూ మెడికల్ కాలేజీకి తరలించారు. కలెక్టర్ పీయూష్ సమరియా, ఐజీ హరేంద్ర మహావార్ ఆసుపత్రికి చేరుకొని పరిశీలించారు. మృతులలో ఐదుగురు మహిళలు ఉన్నారు. మృతులను అరుణ, వైష్ణవి, త్రిష, కృష్ణ, అనిత, ఓం, సూర్యవంశీ, రాజుగా గుర్తించారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారని, ప్రస్తుతం ఎవరి పరిస్థితి విషమంగా లేదని అధికారులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: LK Advani Hospitalized | ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఢిల్లీ అపోలో ఆస్పత్రిలో చికిత్స