అక్షరటుడే, వెబ్డెస్క్: Odisha Engineer | ఒడిశాలోని ఓ ఇంజినీర్ కారు, నివాసాల్లో భారీగా నోట్ల కట్టలు లభ్యం అయ్యాయి. కాంట్రాక్టర్ల నుంచి లంచాలు వసూలు చేస్తున్నారనే సమాచారం మేరకు కటక్ జిల్లా మహానది నార్తర్న్ డివిజన్కు చెందిన సూపరింటెండింగ్ ఇంజనీర్ ప్రసన్జిత్ దాస్పై విజిలిన్స్ అధికారులు దాడులు చేశారు.
ప్రసన్జిత్ దాస్ కారులో వెళ్తుండగా.. భువనేశ్వర్ (Bhubaneswar)లోని ఏజీ చౌక్ వద్ద శుక్రవారం రాత్రి అధికారులు అడ్డుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న అధికారిక వాహనంలో లెక్కల్లో చూపని, అక్రమంగా సంపాదించినట్లు అనుమానిస్తున్న రూ. 7,28,620 నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం శనివారం ఉదయం ఆయన నివాసాల్లో సోదాలు చేపట్టారు.ఆయన అద్దె ఫ్లాట్లో జరిపిన సోదాల్లో రూ. 14,60,000 నగదు లభ్యమైంది.
Odisha Engineer | అదుపులోకి తీసుకొని..
మొత్తం రూ. 21,88,620 నగదుకు సంబంధించి నిందితుడు సరైన వివరణ ఇవ్వలేకపోవడంతో, ఆ మొత్తాన్ని అధికారులు జప్తు చేశారు. ఈ నగదు ఎక్కడి నుండి వచ్చిందో తెలుసుకోవడానికి ఆయనను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. భువనేశ్వర్ విజిలెన్స్ పోలీస్ స్టేషన్లో ఈ ఘటనపై కేసు నమోదైంది.
ఇది కూడా చదవండి..: Maharashtra Drought Relief | రైతుల కోసం ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల విరాళం