Yendamuri Varaprasad Death | సీనియర్ పాత్రికేయుడు యండమూరి వరప్రసాద్ కన్నుమూత

బాన్సువాడకు చెందిన సీనియర్ పాత్రికేయులు యండమూరి వరప్రసాద్ కన్నుమూశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, బాన్సువాడ: Yendamuri Varaprasad Death | బాన్సువాడ (Banswada)కు చెందిన సీనియర్ పాత్రికేయులు యండమూరి వరప్రసాద్ కన్నుమూశారు. అనారోగ్యంతో శనివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు.

Yendamuri Varaprasad Death | కొంతకాలంగా అనారోగ్యంతో..

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మృతి చెందడం మృతి పాత్రికేయ రంగంలో తీవ్ర విషాదాన్ని నింపింది. యండమూరి వరప్రసాద్ గతంలో సాక్షి, ఆంధ్రజ్యోతి, సూర్య తదితర ప్రముఖ దినపత్రికల్లో పనిచేసి జర్నలిజం రంగంలో తనదైన ముద్ర వేశారు. వృత్తిపట్ల అంకితభావంతో పనిచేస్తూ, నిష్పక్షపాతంగా, నిర్భయంగా వార్తలను ప్రజలకు అందించడంలో ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలోనూ, వాస్తవాలను ప్రజల ముందుంచడంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు.

Yendamuri Varaprasad Death | దీర్ఘకాలికంగా..

దీర్ఘకాలంగా పాత్రికేయ రంగంలో సేవలందించిన వరప్రసాద్ మృతి బాన్సువాడ ప్రాంత పాత్రికేయ లోకానికి తీరని లోటని పలువురు జర్నలిస్టులు, ప్రముఖులు పేర్కొన్నారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సంతాపం వ్యక్తం చేశారు. యండమూరి వరప్రసాద్ మృతి పట్ల పాత్రికేయులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థించారు.

ఇది కూడా చదవండి..: Kamareddy Dasara Celebrations | దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నాం..: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *