అక్షరటుడే వెబ్‌డెస్క్: Battlin Gaming Platform | ప్రముఖ గేమింగ్ సంస్థ క్రాఫ్టన్ (KRAFTON) భారతదేశంలోని గేమర్ల కోసం ఒక నూతన ప్లాట్‌ఫామ్‌ను తీసుకొచ్చింది. భారత్‌లో మొట్టమొదటి సారిగా ‘బ్యాట్లైన్’ (Battlin) పేరుతో యూనిఫైడ్ గేమింగ్ టోర్నమెంట్ ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించింది. కాంపిటీటివ్ గేమింగ్‌లో పాల్గొనడం, టోర్నమెంట్లను కనుగొనడం, గుర్తింపు పొందడంతో పాటు ఎలాంటి పారదర్శకత లోపించకుండా రివార్డులను అందించేలా దీన్ని రూపొందించారు. లాంచింగ్ సమయంలో దీనిని ముఖ్యంగా BGMI (బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా) గేమ్‌కు ప్రాధాన్యత ఇస్తూ డిజైన్ చేశారు.
Battlin Gaming Platform | బ్యాట్లైన్ ప్రత్యేకతలు..
భారత్‌లో BGMIకి పోటీదారులు విపరీతంగా ఉన్నప్పటికీ.. దానికి తగిన నిర్మాణం (Structure) మాత్రం లోపించింది. ఇప్పటివరకు ప్లేయర్లు గ్రూప్ చాట్లలో వచ్చే రూమ్ ఐడీలు, థర్డ్-పార్టీ యాప్‌లు, స్క్రీన్షాట్ల ద్వారానే మ్యాచ్‌లను నిర్వహిస్తున్నారు. ఈ సమస్యలన్నింటికి చెక్ పెడుతూ ‘బ్యాట్లైన్’ అన్ని దశలను ఒకే వేదికపైకి తీసుకువచ్చింది. ప్లేయర్లు ఎలాంటి వ్యక్తిగత పరిచయాలు లేదా ఆహ్వానాలతో పనిలేకుండా నేరుగా ఓపెన్ టోర్నమెంట్లలో రిజిస్టర్ చేసుకోవచ్చు. టోర్నమెంట్ షెడ్యూల్స్, ఫలితాలు, రివార్డుల వివరాలు అన్నీ యాప్‌లోనే ముందుగానే స్పష్టంగా కనిపిస్తాయి. నిర్వాహకులకు (Organizers) సైతం రిజిస్ట్రేషన్లు, రూమ్ మేనేజ్మెంట్, ఆటోమేటిక్ బ్రాకెట్లు, నోటిఫికేషన్ల నిర్వహణ చాలా సులభం అవుతుంది. రివార్డుల పంపిణీని కూడా ప్లాట్‌ఫామ్ ద్వారానే పారదర్శకంగా నిర్వహిస్తారు.
Battlin Gaming Platform | గేమర్లకు పెద్దపీట..
వ్యక్తులు, క్రియేటర్లు, కాలేజీలు, గేమింగ్ కేఫ్‌లు , ఆర్గనైజేషన్లు సైతం ఈ ప్లాట్‌ఫామ్‌పై తమ సొంత టోర్నమెంట్లను హోస్ట్ చేసుకునే వెసులుబాటు ఉంది. సాధారణ గేమర్ నుండి ప్రొఫెషనల్ స్థాయికి ఎదుగడానికి ఈ ప్లాట్‌ఫామ్ చక్కటి వేదికగా నిలుస్తుందని క్రాఫ్టన్ తెలిపింది. ఇందులో ఎలాంటి బెట్టింగ్‌లు, వాగరింగ్ లేదా పందాలు ఉండవు.. పూర్తిగా కేవలం స్కిల్ (నైపుణ్యం) ఆధారంగానే పోటీలు జరుగుతాయి.
Battlin Gaming Platform | ‘బ్యాట్లైన్ ఓపెన్ సీజన్ 1’ షురూ..
ఈ ప్లాట్‌ఫామ్ ప్రారంభం సందర్భంగా ‘బ్యాట్లైన్ ఓపెన్ సీజన్ 1’ టోర్నమెంట్‌ను ప్రకటించారు.
రిజిస్ట్రేషన్లు: నవంబర్ 1, 2026 వరకు రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉంది (5,000+ స్లాట్లు అందుబాటులో ఉన్నాయి).
పోటీలు: నవంబర్ 2 నుంచి రెండు ట్రాక్‌లలో మ్యాచ్‌లు ప్రారంభమై, నవంబర్ 29, 2026న జరిగే ట్రాక్ 2 ఫైనల్స్‌తో ముగుస్తాయి.
ప్రైజ్ పూల్: ట్రాక్ 1 విజేత జట్టుకు బీజీఐఎస్ (BGIS) స్లాట్‌తో పాటు రూ. 5,00,000 ప్రైజ్ పూల్ లభిస్తుంది. అలాగే ట్రాక్ 2 లో రూ. 15,00,000 ప్రైజ్ పూల్ ఉంటుంది.
ఈ సందర్భంగా క్రాఫ్టన్ ‘బ్యాట్లైన్’ లీడ్ జేమ్స్ యోంగ్క్వాన్ కిమ్ మాట్లాడుతూ.. భారత్‌లో టాలెంటెడ్ గేమర్లు చాలా మంది ఉన్నారని, వారికి ఎలాంటి అడ్డంకులు లేకుండా సులభంగా టోర్నమెంట్లలో పాల్గొనేలా ఈ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించినట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: Nizamabad RTA Home Guards | రవాణాశాఖ నుంచి ఇద్దరు హోంగార్డుల సరెండర్