Kidnapping Case | పోలీసులమని చెప్పి రూ.1.3 కోట్లు వసూలు

నగల వ్యాపారిని కిడ్నాప్​ చేసి డబ్బులు వసూలు చేసిన ముఠాను పోలీసులు అరెస్ట్​ చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kidnapping Case | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో నగల వ్యాపారిని కొందరు కిడ్నాప్​ చేశారు. తాము పోలీసులం అని చెప్పి అతడిని అపహరించారు. అనంతరం రూ.15 కోట్లు డిమాండ్​ చేశారు. చివరకు రూ.1.3 కోట్లు వసూలు చేసిన తర్వాత అతడిని వదిలేశారు.

సదరు వ్యాపారి ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన చిక్కడపల్లి పోలీసులు, సికింద్రాబాద్ (Secunderabad) జోన్ కమిషనర్ టాస్క్ ఫోర్స్‌తో కలిసి 10 మందిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 1.07 కోట్ల నగదు, 118.26 గ్రాముల బంగారు ఆభరణాలు, ఐదు వాహనాలు, ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

Kidnapping Case | ఆస్తి వివాదంతో..

బాధితుడు కె. శ్రీనివాసరావు ఈ నెల 5న రామంతపూర్‌లోని తన నగల దుకాణానికి వెళ్తుండగా అదృశ్యమయ్యాడు. గోల్నాక ఫ్లైఓవర్ సమీపంలో దుండగులు తనను అపహరించారని, రహస్య ప్రదేశానికి తీసుకెళ్లారని ఆయన పోలీసులకు చెప్పారు. కాగా బోడుప్పల్‌లోని హేమానగర్‌లో ఉన్న ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుకు సంబంధించిన వివాదమే ఈ కిడ్నాప్‌కు దారితీసిందని పోలీసులు పేర్కొన్నారు. ప్రధాన నిందితుడు దుమావత్ శ్రీకాంత్ శ్రీనివాసరావుపై కక్ష పెంచుకున్నాడు. అనంతరం కిడ్నాప్​ చేసి డబ్బులు వసూలు చేశాడు.

దీనిని కూడా చదవండి : ACB Raids | అవినీతి తిమింగలం.. కీసర సీఐ ఇళ్లలో ఏసీబీ సోదాలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *