Nizamabad RTFMS System | రియల్‌టైమ్ ఫీడర్ మానిటరింగ్ సిస్టమ్‌తో మెరుగైన విద్యుత్ సేవలు

రియల్‌టైమ్ ఫీడర్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా జిల్లాలో వినియోగదారులకు మరింత నాణ్యమైన విద్యుత్ సేవలు అందుతాయని నిజామాబాద్ ​ట్రాన్స్‌కో ఎస్‌ఈ పీవీ రాజేశ్వర్ రావు తెలిపారు.

shashi kiran Mottala

​అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad RTFMS System | రియల్‌టైమ్ ఫీడర్ మానిటరింగ్ సిస్టమ్ (RTFMS) ద్వారా జిల్లాలో వినియోగదారులకు మరింత నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్ సేవలు అందుతాయని నిజామాబాద్​(Nizamabad) ట్రాన్స్‌కో (TGNPDCL) ఎస్‌ఈ పీవీ రాజేశ్వర్ రావు తెలిపారు. ఈ మేరకు శనివారం ప్రకటనలో తెలిపారు.

Nizamabad RTFMS System | నిజామాబాద్​ సర్కిల్​లో..

నిజామాబాద్ సర్కిల్ పరిధిలోని 139 సబ్‌స్టేషన్లను స్కాడా (SCADA) వ్యవస్థతో అనుసంధానం చేయగా, మరో 20 సబ్‌స్టేషన్ల పనులు పురోగతిలో ఉన్నాయని పేర్కొన్నారు. విద్యుత్ అంతరాయాలు, ఓవర్‌లోడ్, వోల్టేజ్ హెచ్చుతగ్గులు ఏర్పడితే స్కాడా కంట్రోల్ రూమ్‌కు వెంటనే రియల్‌టైమ్ అలర్టులు వస్తాయని పేర్కొన్నారు. ​వేగవంతమైన పరిష్కారం: క్షేత్రస్థాయి సిబ్బంది తక్షణమే స్పందించి సమస్యలను వేగంగా పునరుద్ధరించడానికి వీలవుతుందన్నారు. లోడ్, విద్యుత్ వినియోగాన్ని విశ్లేషించి సాంకేతిక లోపాలను ముందే గుర్తించవచ్చు. ​ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించడమే లక్ష్యంగా సంస్థ పనిచేస్తోందని ఎస్‌ఈ వివరించారు.

ఇది కూడా చదవండి: దుల్కర్ కొత్త మ్యాజిక్..టీజర్ అదుర్స్​..! 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *