MVSR College Dandiya Accident | హైదరాబాద్‌లోని ఎంవీఎస్‌ఆర్‌ కాలేజీ దాండియా వేడుకలో ప్రమాదం.. విద్యార్థుల్లో ఆందోళన

నాదర్‌గుల్‌లో కూలిపోయిన లైటింగ్‌ వ్యవస్థ.. ఒక యువతి మృతి చెందినట్లు ప్రచారం

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: MVSR College Dandiya Accident | హైదరాబాద్‌ Hyderabad పరిధిలోని నాదర్‌గుల్‌లో ఉన్న ఎంవీఎస్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో నిర్వహించిన దాండియా వేడుకలో ప్రమాదం జరిగినట్లు సమాచారం. విద్యార్థులు నృత్యం చేస్తున్న సమయంలో లైటింగ్‌ వ్యవస్థ వారిపై పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఒక యువతి మృతి చెందినట్లు సమాచారం. పలువురు విద్యార్థులు గాయపడినట్లు కూడా తెలుస్తోంది.

ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి పరిస్థితులపై ఆందోళన నెలకొన్నట్లు సమాచారం. అయితే, మృతుల సంఖ్య, గాయపడిన వారి వివరాలు, ప్రమాదానికి దారితీసిన కారణాలపై అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

MVSR College Dandiya Accident | ప్రమాదానికి కారణమేంటి?

దాండియా వేడుక కోసం ఏర్పాటు చేసిన లైటింగ్‌ వ్యవస్థ ఎలా కూలిపోయింది? ఏర్పాట్లలో ఏవైనా లోపాలు ఉన్నాయా? ప్రమాదం జరిగిన వెంటనే విద్యార్థులకు ఎలాంటి సహాయక చర్యలు అందించారు? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. కాలేజీ యాజమాన్యం, పోలీసుల నుంచి అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు నిర్ధారణ కానున్నాయి.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *