అక్షరటుడే, వెబ్‌డెస్క్ : France Protests | పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా ఫ్రాన్స్‌లో చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. దీంతో శనివారం పోలీసులకు, నిరసనకారులకు మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు జరిగాయి. పలువురు నిరసనకారులు దుకాణాల్లోకి చొరబడి దోపిడీలు చేశారు. ప్రభుత్వ ఆస్తులను తగులబెట్టారు.
ఫ్రాన్స్‌లో (France Protests) కొన్ని వారాలుగా విద్యార్థులు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో శనివారం అవి హింసాత్మకంగా మారాయి. ముఖానికి మాస్కులు ధరించిన యువకులు పార్క్ చేసిన కార్లకు నిప్పుపెట్టి, అనేక దుకాణాలను దోచుకోవడంతో, పారిస్‌లోని వీధులన్నీ ధ్వంసమయ్యాయి. ఈ హింసను ఫ్రాన్స్ ప్రధాని సెబాస్టియన్ ఖండించారు. శనివారం రాత్రి వరకు 1,200 మందిని అరెస్టు చేశామని తెలిపారు. ఈ అల్లర్లలో 150 మంది పోలీసులు గాయపడ్డారు. ఈ నిరసనల్లో 5,50,000 మంది పాల్గొన్నారని అధికారులు తెలిపారు.
France Protests | దుకాణాల్లోకి చొరబడి
పారిస్, మార్సెయిల్, నైస్, నాంటెస్, బోర్డో, లిమోజెస్, లిల్లే, టౌలౌస్ వంటి నగరాల్లో నిరసనకారులు విధ్వంసం సృష్టించారు. సూపర్ మార్కెట్లు, ఫార్మసీలు, లగ్జరీ బోటిక్‌లు, ఇతర దుకాణాల్లోకి చొరబడి వస్తువులను ఎత్తుకెళ్లారు. ఈ దాడుల్లో ప్రపంచ యుద్ధాలను తట్టుకుని నిలిచిన ఫ్రాన్స్‌లోని లిమోజెస్ నగరపాలక కార్యాలయం ధ్వంసమైంది. అనేక నగరాల్లోని పురపాలక భవనాలను లక్ష్యంగా చేసుకొని విధ్వంసం సృష్టించారు.
ఫ్రాన్స్‌లో లగ్జరీ స్టోర్లలో లూటీ..
ఫ్రాన్స్‌లో జరిగిన నిరసనలు పలు ప్రాంతాల్లో హింసాత్మకంగా మారాయి. నిరసనకారులు లగ్జరీ దుకాణాలపై దాడులు చేసి లూటీకి పాల్పడ్డారు. పారిస్‌తో పాటు పలు నగరాల్లో ముసుగులు ధరించిన వ్యక్తులు దుకాణాల అద్దాలు పగలగొట్టి వస్తువులను ఎత్తుకెళ్లినట్లు వార్తలు వెలువడ్డాయి. బోర్డోలో లూయీ విటాన్ స్టోర్ దోపిడీకి గురైనట్లు నివేదికలు వెల్లడించాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
#france #paris #louisvuitton #viralvideo #protests
#aksharatoday— Akshara Today | Telugu News (@AksharaToday) October 18, 2026
దీనిని కూడా చదవండి : Saddula Bathukamma | పుడమిపై పూల సింగిడి.. నేడు సద్దుల బతుకమ్మ