Tiger Shroff Firing Case | టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల ఘటన.. రాజస్థాన్​లో నిందితుల అరెస్ట్​

నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు జరిపిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tiger Shroff Firing Case | ముంబై (Mumbai)లో నటుడు టైగర్ ష్రాఫ్‌పై జరిగిన కాల్పుల ఘటనలో ముగ్గురు నిందితులను కోటా పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు హర్యానా వాసులు కాగా, ఒకరు బీహార్ వాసి. కోటా నగర పోలీసు బృందం వారిని రైలులో నుంచి పట్టుకుందని కోటా ఎస్పీ తేజస్వని గౌతమ్ తెలిపారు.

నిందితుల్లో ఇద్దరు కిరాయి హంతకులు కాగా, మూడవ వ్యక్తి దాడి తర్వాత వారు తప్పించుకోవడానికి సహాయం చేసినట్లు అనుమానిస్తున్నారు. నిందితుల్లో ఒకరు హర్యానాలోని సోనిపట్‌కు చెందిన 17 ఏళ్ల మైనర్. మిగిలిన ఇద్దరిని బీహార్‌లోని బెగుసరాయ్‌కు చెందిన 22 ఏళ్ల హృతిక్ కుమార్ అలియాస్ రోషన్. ఇతను ప్రస్తుతం ముంబైలోని అంధేరీ వెస్ట్‌లో నివసిస్తూ ‘రాపిడో’ రైడర్‌గా పనిచేస్తున్నాడు. హర్యానాలోని సోనిపట్‌కు చెందిన 18 ఏళ్ల రెహాన్ అని గుర్తించారు.

Tiger Shroff Firing Case | పక్కా సమాచారం మేరకు..

నిందితులు రైలులో రాజస్థాన్​కు పారిపోతున్నారనే సమాచారం మేరకు ముంబై పోలీసులు రాజస్థాన్ యాంటీ-గ్యాంగ్‌స్టర్ టాస్క్ ఫోర్స్ (AGTF), కోటా సిటీ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరు పూణే-జైపూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తుండగా పట్టుబడ్డారు. నిందితులు శిక్షణ పొందిన హంతకులని, దాడి కోసం ముందే రెక్కీ నిర్వహించారని పోలీసులు తెలిపారు. టైగర్ ష్రాఫ్ దినచర్యను గమనించిన తర్వాతే వారు ఈ దాడికి పథకం రచించారని సమాచారం. కాల్పుల అనంతరం నిందితులు ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం.. ఎస్వీ రోడ్ (SV Road) మీదుగా విలే పార్లే, అంధేరీ వైపు పారిపోయారు.

ఇది కూడా చదవండి..: Varanasi Road Accident |ఫ్లైఓవర్‌పై సెల్ఫీ సరదా.. దూసుకొచ్చిన లారీ.. నలుగురు మృతి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *